News

నూతన సంవత్సరం షాకింగ్ న్యూస్ :రూ.25 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ...

Srikanth B
Srikanth B
Gas Price hike 2023
Gas Price hike 2023

నూతన సంవత్సరం 2023 మొదటి రోజున LPG కమెర్షియల్ గాస్ సిలిండర్ ధరను పెంచుతూ గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి . కమర్షియల్ సిలిండర్ల 19 కేజీల ధరలను రూ.25 వరకు పెంచారు. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే 14 కేజీల గ్యాస్ ధర మాత్రం పెరగలేదు దీనితో పాత రేటు పై మాత్రమే ఇంట్లో వాడే గ్యాస్ లభించనుంది .

 

కమర్షియల్ LPG సిలిండర్ల పెంపు ధరలు:
జనవరి 1, 2023 నుండి వాణిజ్య సిలిండర్ ధరలను రూ. 25 వరకు పెంచుతున్నట్లు (OMC ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ )లు ప్రకటించాయి . దీని ప్రభావం రెస్టారెంట్‌లు, హోటళ్లు నిర్వహించే సంస్థలపై పడనున్నాయి దీనితో హోటల్ లలో ఆహారాల ధరలు పెరగనున్నాయి . మరియు దీని ప్రభావం ప్రత్యేక్షం గ లేనప్పటికీ పరోక్షంగా సామాన్యులపై పడే అవకాశం వుంది .


మెట్రోపాలిటన్‌ నగరాలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ యొక్క తాజా ధరలు ;

ఢిల్లీ - రూ 1768 / సిలిండర్

ముంబై - రూ 1721/ సిలిండర్

కోల్‌కతా - రూ 1870/ సిలిండర్

చెన్నై - రూ 1917/ సిలిండర్
హైదరాబాద్ -1798

AP ప్రభుత్వం గుడ్‌న్యూస్‌: ఏడాది పాటు ఉచిత రేషన్.. కొత్త సంవత్సరం నుంచి అమలు ..

మెట్రోపాలిటన్లలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలను తనిఖీ చేయండి:
ఢిల్లీ - రూ 1053

ముంబై - రూ 1052.5

కోల్‌కతా - రూ 1079

చెన్నై - రూ 1068.5
హైదరాబాద్ -1105

గ్యాస్ కంపనీలు డొమెస్టిక్ సిలిండర్ ధరలను చివరిసారి జూలై 6 2022లో పెంచాయి. ఇది మొత్తం రూ.153.5కి పెరిగింది. నాలుగు సార్లు ధరలు పెంచారు. గ్యాస్ కంపెనీ లు మొదట మార్చి 2022లో రూ. 50 పెంచాయి, తర్వాత మళ్లీ మే నెలలో రూ. 50 మరియు రూ. 3.50 పెంచింది. చివరకు గత ఏడాది జూలైలో డొమెస్టిక్ సిలిండర్ ధరలను రూ.50 పెంచింది.

AP ప్రభుత్వం గుడ్‌న్యూస్‌: ఏడాది పాటు ఉచిత రేషన్.. కొత్త సంవత్సరం నుంచి అమలు ..

Related Topics

Domestic Gas Gas Subsidy

Share your comments

Subscribe Magazine

More on News

More