2018 కేరళలో విజృంభించిన నిఫా వైరస్ కారణంగా అప్పట్లో 17 మంది మరణించారు , దీనికి తోడు దాదాపు 230 మందికి సోకినా ఈ వైరస్ కారణంగా ఒక నర్స్ కూడా వుంది . అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ వైరస్ ఇప్పుడు తిరిగి వ్యాపిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స లేదు. అయితే ఇప్పుడున్న వాటిలో 'మోనో క్లోనల్ యాంటీబాడీ' చికిత్స మాత్రమే సమర్థవంతంగా ఉంది. ఇప్పుడు ఇవి కేరళకి చేరుకున్నాయి. జ్వరం, శ్వాసకోశ సమస్య, తలనొప్పి, వాంతుల వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి ముదిరితే మెదడు వాపు, మూర్చ, చివరకు కోమాలోకి వెళ్లి మరణం సంభవిస్తుంది.
2021 సంవత్సరంలో మళ్ళి విజృంభించిన ఏ వైరస్ ఒక బాలుడుని ప్రాణాలను బలిగొంది, ఇప్పుడు కేరళలో నిపా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది తాజాగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కేసులు సంఖ్య 6 కు చేరింది దీనితో వీరితో కాంటాక్ట్ లో వున్నా 706 మందిని ప్రభుత్వం ట్రేస్ చేసి పరీక్షలు నిర్వహిస్తుంది , వీరిలో దాదాపు 77 మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారని కానీ వారికి ఇంకా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. ప్రస్తుతం 13 మంది ఆస్పత్రుల్లో పరిశీలనలో ఉన్నారు. వారికి తలనొప్పి వంటి తేలిక లక్షణాలు కనిపిస్తున్నాయని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త తెలిపిన ప్రభుత్వం..
ఇప్పటికే కేరళ లోని పలు జిల్లాలో స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. గబ్బిలాలు, పందుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది, కాబట్టి అటవీ ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Share your comments