News

NITI AAYOG:స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ప్రకటించిన నీతి ఆయోగ్, తెలుగు రాష్ట్రాల ర్యాంకులు తెలుసుకోండి

S Vinay
S Vinay

నీతి ఆయోగ్ (NITI AAYOG) స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ( State Energy and Climate Index) ని ప్రారంభించింది. వాతావరణం మరియు ఇంధన రంగంలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అభివృద్ధ్దిని ట్రాక్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్న మొదటి సూచిక ఇది.

అయితే ఈ సూచిక ప్రకారం గుజరాత్ రాష్ట్రం ప్రథమ స్థానం లో ఉంది. తర్వాతి స్థానంలో కేరళ మరియు పంజాబ్ రాష్ట్రాలు ఉత్తమ మైన పనితీరుని కనబరిచాయి. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం 11 వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 12 వ స్థానంలో ఉంది.

చిన్న రాష్ట్రాలలో చూసుకుంటే గోవా, త్రిపుర మరియు మణిపూర్‌లలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ సూచిక లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి.

State Energy and Climate Index సూచిక యొక్క లక్ష్యాలు:
ఇంధన సదుపాయం, వినియోగం, ఇంధన సామర్థ్యం మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి వాటిపై అభివృద్ధి ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంక్ ఇవ్వడం.

రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛమైన మరియు సమర్థవంతమైన ఇంధన అభివృద్ధి దిశగా నడపడంలో సహాయం చేయడం.

రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం. వంటి అంశాలపై దృష్టి సారించడమే ఈ State Energy and Climate Index సూచిక యొక్క ముఖ్య లక్ష్యం.

State Energy and Climate Index ఆరు ప్రమాణాల ఆధారంగా ర్యాంకులను నిర్ణయిస్తుంది;

Discoms' (Power distribution companies) Performance (విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు)

Access Affordability And Reliability Of Energy,

Clean Energy Initiatives,

Energy Efficiency

Environmental Sustainability,(పర్యావరణ సమతుల్యత,)

New Initiatives.(వినూత్న కార్యక్రమాలు )

మరిన్ని చదవండి.

పత్తి పంట మన నాగరిక వారసత్వానికి గొప్ప ప్రతీక - వెంకయ్య నాయుడు

Share your comments

Subscribe Magazine

More on News

More