గ్యాస్ ధర పెరుగుతుండడంతో,ప్రత్యామ్నాయం గా గ్యాస్ కుక్కర్లు మరియు ఓవెన్‌లను ఉపయోగించడం కొనసాగిస్తే, కరెంట్ , డబ్బు రెండూ వృధా అవుతుందని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. వంటగ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోతుండడంతో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు బయో గ్యాస్ అనే ఆహార వ్యర్థాల నుంచి తయారయ్యే వంటగ్యాస్ వచ్చింది.
ప్రస్తుతం కేరళ తదితర రాష్ట్రాల్లో వినియోగించే బయో గ్యాస్ స్టవ్‌లను ఎక్కువగా వినువాడుతున్నారు. ప్రతుతం ఈ బయో గ్యాస్ స్టవ్‌లను వివిధ ప్రాంతాలలో వినియోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాడులో కూడా విరుదునగర్ జిల్లా ప్రజలకు తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయతిస్తుంది.
LPG వంటగ్యాస్ ప్రస్తుతం 1120 రూపాయలకు అమ్ముడవుతోంది, కాబట్టి మధ్యతరగతి ప్రజలు వారి నెలవారీ బడ్జెట్‌లో కోత ఉన్నందున వంట గ్యాస్ కొనుగోలుకు మంచి ప్రత్యామ్నాయంగా బయో గ్యాస్‌ను ఉపయోగించవచ్చు. ఈ బయో గ్యాస్ స్టవ్‌లను వాడటానికి వినియోగదారులకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ బయో గ్యాస్ స్టవ్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి..
జన్ ధన్ ఖాతాదారులకు శుభవార్త: రూ.1.3 లక్షల బెనిఫిట్స్ తో పాటు రూ.10 వేలు..
ఇంటి నుండి ఆహార వ్యర్థాలు', కూరగాయల వ్యర్థాలను కంపోస్ట్ చేయడం మరియు దానిలో ఉత్పత్తి అయ్యే మీథేన్‌ను వంటకు ఉపయోగించుకోవచ్చు. ఇలా వ్యర్ధాలను మనము ఉపయోగించుకోవడం ద్వారా వంట గ్యాస్ ఖర్చును తగ్గించడంతోపాటు గృహ వ్యర్థాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది.
సగటున రోజుకు 45 నిమిషాల పాటు దీన్ని ఉపయోగించి వంట చేయవచ్చని, అయితే ఎక్కువ వ్యర్థాలు వేయడం ద్వారా రోజుకు గరిష్టంగా 90 నిమిషాల వరకు ఉడికించవచ్చని మునియసామి చెప్పారు. మరియు ఎల్‌పిజి గ్యాస్‌లా కాకుండా, ఇది కూరగాయల వ్యర్థాలతో తయారవుతుంది, కాబట్టి ఇది ప్రమాదాలకు తక్కువ అవకాశం ఉందని గమనించవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments