నోబెల్ బహుమతులు 2022 ను నిన్నటి నుంచి అందిస్తున్న విషయం తెలిసిందే నిన్న విద్య విభాగానికి చెందినమానవ పరిణామ క్రమంపై విశేషమైన పరిశోధనకు వైద్య విభాగం లో నోబెల్.. పాబోను వరించింది .కాగా సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను సుకురో మనాబే, క్లాస్ హలిస్‌మన్, జార్జియో పారిసీలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది.
కాగా, జార్జియో పారసీకి సగం పురస్కారాన్ని అందించగా, మిగతా సగాన్ని మనాబే, హలిస్‌మన్‌లు పంచుకున్నారు. నోబెల్ బహుమతి ప్రకటనలు సోమవారం నుంచి ప్రారంభం కాగా, తొలి రోజు వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు.
.. ఈ ఏడాది వైద్యరంగానికి సంబంధించిన నోబెల్ విజేతను సోమవారం ప్రకటించారు. మెడిసిన్ లో విశేష కృషి చేసిన స్వీడన్ కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబో(67)ను నోబెల్ పురస్కారం వరించింది.
మానవ పరిణామ క్రమంపై అనేక ఆవిష్కరణలు చేసినందుకు గానూ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో (Svante Paabo) నాయకత్వం వహించారు.
మంగళవారం భౌతికశాస్త్ర నోబెల్ విజేతను,బుధవారం రసాయన, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి విజేతల పేర్లను ప్రకటిస్తారు.
ఇవాళ భౌతికశాస్త్ర నోబెల్ విజేతను ప్రకటించనున్నారు. బుధవారం రసాయన, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి విజేతల పేర్లను ప్రకటిస్తారు. అయితే ఆర్థిక రంగానికి సంబంధించిన నోబెల్ విజేతను మాత్రం అక్టోబరు 10న ప్రకటించనున్నారు. నోబెల్ విజేతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందజేయనున్నారు. ఈ ప్రైజ్ మనీని డిసెంబరు 10న అందజేస్తారు. స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరుమీద ఈ అవార్డులను 1901 నుంచి ఇస్తున్నారు.
Share your comments