వివిధ రంగాలలో విశేష కృషికి గాను లభించే ప్రతిష్టాత్మకమైన బహుమతి నోబెల్ 2022 విజేతలను ప్రకటించింది మానవ పరిణామ క్రమంపై విశేషమైన పరిశోధనకు వైద్య విభాగం లో నోబెల్.. పాబోను వరించింది .. ఈ ఏడాది వైద్యరంగానికి సంబంధించిన నోబెల్ విజేతను సోమవారం ప్రకటించారు. మెడిసిన్ లో విశేష కృషి చేసిన స్వీడన్ కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబో(67)ను నోబెల్ పురస్కారం వరించింది.
1955లో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జన్మించిన స్వాంటే పాబో ప్రస్తుతం లీప్‌జిగ్‌లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీకి డైరెక్టర్‌గా ఉన్నారు. 1982లో వైద్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న సునే బెర్గ్‌స్ట్రోమ్ కుమారుడు స్వాంటే పాబో.
మానవ పరిణామ క్రమంపై అనేక ఆవిష్కరణలు చేసినందుకు గానూ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో (Svante Paabo) నాయకత్వం వహించారు.
మంగళవారం భౌతికశాస్త్ర నోబెల్ విజేతను,బుధవారం రసాయన, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి విజేతల పేర్లను ప్రకటిస్తారు.
ఇవాళ భౌతికశాస్త్ర నోబెల్ విజేతను ప్రకటించనున్నారు. బుధవారం రసాయన, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి విజేతల పేర్లను ప్రకటిస్తారు. అయితే ఆర్థిక రంగానికి సంబంధించిన నోబెల్ విజేతను మాత్రం అక్టోబరు 10న ప్రకటించనున్నారు. నోబెల్ విజేతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందజేయనున్నారు. ఈ ప్రైజ్ మనీని డిసెంబరు 10న అందజేస్తారు. స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరుమీద ఈ అవార్డులను 1901 నుంచి ఇస్తున్నారు.
రాష్ట్రంలో మరోసారి 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం !
నోబెల్ బహుమతి ని ఎవరు స్థాపించారు ?
వ్యాపారవేత్త మరియు వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఙాపకార్థంగా నోబెల్ బహుమతిని ఏర్పాటు చేశారు . నోబెల్ బహుమతిని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీరధర్మశాస్త్రం లేదా వైద్యం, సాహిత్యం మరియు శాంతికి సంబంధించిన కేటగిరీలలో గడిచిన సంవస్తరం లో వారు చేసిన కృషికి గాను నోబెల్ ను అందచేస్తారు.
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఎవరు?
ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు, శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త, అతను కవిత్వం మరియు నాటకం కూడా వ్రాసాడు. అతని వైవిధ్యమైన అభిరుచులు నోబెల్ బహుమతులలో ప్రతిబింబిస్తాయి, అతను తన చివరి వీలునామాలో 1895లో పునాది వేసాడు.
మీరు నోబెల్ బహుమతులను ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు?
మొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేయబడ్డాయి మరియు అప్పటి నుండి ఏటా ప్రదానం చేస్తున్నారు. ఆ సమయంలో నోబెల్ బహుమతులు ఇవ్వని సంవత్సరాలు ఉన్నాయి - ఎక్కువగా మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918) మరియు II (1939-1945) సమయంలో. అన్ని నోబెల్ బహుమతుల పూర్తి జాబితాను చూడండి.
నోబెల్ ప్రైజ్ కేటగిరీలు ఏమిటి?
నోబెల్ ప్రైజ్ కేటగిరీలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ లేదా మెడిసిన్, సాహిత్యం మరియు శాంతి - ఇవి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో నిర్దేశించబడ్డాయి. 1968లో, స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ (స్వీడన్ సెంట్రల్ బ్యాంక్) ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రాలలో స్వేరిజెస్ రిక్స్‌బ్యాంక్ బహుమతిని స్థాపించింది.
Share your comments