ఎటాకేలకు అందరు ఎదురుచూస్తున్న ఎన్నికల నగరమోగింది . దేశవ్యాప్తం గ ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ తో కలుపుకొని రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి ఇవి 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు కీలకం కానున్నాయి .
అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం ఈ ఏడాది ఏకంగా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం లల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయాత్తమైంది.
ఫిబ్రవరి 16వ తేదీన త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల- 27వ తేదీన నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ను ముగించేలా చర్యలు తీసుకుంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు- మార్చ్ 2వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిపారు .
ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గిన వరి సాగు ... ఇప్పటికి సాగు అయ్యింది 9 లక్షల ఎకరాలు మాత్రమే
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగనుండటంతో అన్ని పార్టీలు కూడా ఈ తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నాయి.
తొలి విడతలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఈ మూడు కూడా ఈశాన్య రాష్ట్రాలే. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ లల్లో ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్- కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. వెలువడతాయి.
Share your comments