News

రైతులకు గమనిక.. ఇక వీరి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు రావు! ఇప్పుడే చెక్ చేసుకోండి!

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలో పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్న లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకవేళ రైతులు గనుక ఈ పథకంలో చేరాలి అనుకుంటున్నట్లయితే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోకపోతే తర్వాత తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కాక ఇబ్బందులు పడతారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించే ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా రైతులకు వార్షిక సహాయం మొత్తం రూ.6000 ప్రభుత్వం అందిస్తుంది. రైతులను ఆదుకోవడానికి మరియు వారి పంట సంబంధిత ఖర్చులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రభుత్వం ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా రైతుల ఖాతాలకు రూ.2,000 జమ చేస్తున్నారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 14 వాయిదాలను రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుతం 15వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

ఈ పిఎం కిసాన్ పథకం యొక్క డబ్బులు కొంతమందికి వర్తించదని తెలుసుకోవాలి. ప్రత్యేకించి, వైద్యులు, న్యాయవాదులు మరియు చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వ్యక్తులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నా, ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు అనర్హులు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా భూమి ఉన్నా పీఎం కిసాన్ వర్తించదు. నెలకు రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి అనర్హులు.

ఇది కూడా చదవండి..

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు జీతాలు అందేది అప్పుడే? ఆలస్యంపై సైతం క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స..

అదేసమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవిలో ఉన్నా లేదంటే మాజీ రాజకీయ నాయకులకు స్కీమ్ వర్తించదు. వీరికి మాత్రమే కాకుండా అర్హత కలిగి ఉండి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వంటి వాటిల్లో వివరాలు తప్పుగా ఉన్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు రావని గుర్తించాలి.

ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. ఈ పథకం యొక్క డబ్బులను పొందాలంటే లబ్ధిదారులు కచ్చితంగా ఇకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఇకేవైసీ చేయకపోతే వారికి డబ్బులు అందవు. అదే సమయంలో పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరాలని భావించే పైన ఇచ్చిన వారికి స్కీమ్ వర్తించదని తెలుసుకోవాలి.

2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 14 వాయిదాలను రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుతం 15వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విడుదల తేదీని భారత ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అయితే, పాత డేటా ప్రకారం, నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఈ ఏడాది చివరి నాటికి 15వ విడత రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు జీతాలు అందేది అప్పుడే? ఆలస్యంపై సైతం క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స..

Share your comments

Subscribe Magazine

More on News

More