రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి తొలగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. దేశంలో మార్కెట్ నుండి ఈ రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే నెల 19వ తేదీన అధికారికంగా ప్రకటించింది. ప్రజలు ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు RBI గడువు ఇచ్చింది. ఈ గడువు కేవలం నాలుగు రోజుల్లో ముగుస్తున్నందున, ఇంకా ఎవరైనా రూ.2000 నోట్లను కలిగి ఉన్నట్లయితే, వీలైనంత త్వరగా వాటిని మార్చుకోవాలని ఆర్బిఐ సూచిస్తుంది.
కాగా, ఈ నోట్ల మార్చుకునేందుకు 4 రోజులే సమయం ఉంది. ఆ నాలుగు రోజుల్లో కూడా ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు ఉంది. సెప్టెంబర్ 26 మరియు 27 వరకు అనగా మంగళవారం, బుధవారం బ్యాంకులు యథావిథిగా పనిచేయనున్నాయి. ఇక 28వ తేదీన గురువారం నాడు బ్యాంకులకు సెలవు. ఈ సెలవు తరువాత 29, 30 తేదీల్లో బ్యాంకులు యదావిధిగా పనిచేస్తాయి.
ఈ నాలుగు రోజుల్లోనే మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు వీలు ఉంటుంది. అందుకని వినియోగదారులు బ్యాంకు పనివేళలను తెలుసుకొని 2వేల రూపాయల నోట్లతో వెళ్తే మంచిది. మరోవైపు పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్‌లైన్‌ను ఆర్బీఐ పొడగించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..
కేవలం నాలుగు నెలల్లో భారీగా పెరిగిన పసుపు ధరలు.. ఎందుకో తెలుసా?
సెప్టెంబరు నెలాఖరులో వచ్చే సెలవులను పరిగణనలోకి తీసుకుని, వ్యక్తులు తమ రూ.2000 నోట్లను మార్చుకోవడానికి అదనంగా రెండు వారాల సమయం ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి తుది నిర్ణయం మాత్రం ఆర్బీఐదే అని, వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మే 19న సెంట్రల్ బ్యాంక్ 2000 రూపాయల నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
అయితే, వ్యక్తులు ఈ నోట్లను తమ ఖాతాల్లో జమ చేసుకోవడానికి లేదా బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువును అందించారు. దీంతో ప్రజలు వెంటనే చర్యలు తీసుకుని తమ నోట్లను మార్చుకుంటున్నారు. వివిధ బ్యాంకుల నుండి పొందిన డేటా ప్రకారం, సెప్టెంబర్ 1 నాటికి, 3.32 లక్షల కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి తిరిగి వచ్చాయి. దేశంలో చలామణిలోకి పంపబడిన మొత్తం 2,000 రూపాయల నోట్లలో 93 శాతం విజయవంతంగా తిరిగి వచ్చినట్లు RBI ఇటీవల వెల్లడించింది.
ఇది కూడా చదవండి..
Share your comments