కరోనా వైరస్ దేశ వ్యాప్తముగా విజృంభించి దాదాపు నాలుగు ఏళ్ళు కావస్తుంది. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టడంతో జనాలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కానీ కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ప్రజలు ఇంట్లో నుంచి రావడానికి భయపడే వారు , తొలి దశలో అది పుట్టించిన భయం మాత్రం అంతఇంత కాదు , అ భయం తాలూకు వింత ఘటనలను మనం చూస్తూనే ఉన్నాము గత ఏడాది కరొనకు బయపడి ఒక కుటుంబమే 3 సంవత్సరాలుగా బయటికి రాకుండా ఉండిపోయారు
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి కోవిడ్ బూస్టర్ డోస్‌లను పంపిణీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా, పౌరులు చురుకుగా ఉండాలని మరియు వైరస్ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని డిపార్ట్‌మెంట్ శ్రీనివాసరావు డైరెక్టర్ కోరారు.
రాష్ట్రంలో తొలి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందించేందుకు కోవాగిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను వినియోగించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పుడు ప్రజలు కోవిద్ భారిన పడకుండా బూస్టర్ మోతాదుగా కార్బోవాక్ ను తీసుకోవచ్చు అని వైద్యశాఖ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కార్బోవాక్ ను బూస్టర్ మోతాదును అందిస్తుంది.
ఇది కూడా చదవండి..
రైతులకు గుడ్ న్యూస్: ఆర్బీకేల ద్వారా తక్కువ ధరలకే మిర్చి విత్తనాలు..
బుధవారం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. బహిరంగ మార్కెట్ నుంచే కొనుగోలు చేయాలని వైద్యశాఖ తాజాగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ బయోలాజికల్ నుంచి 5 లక్షల కార్బో వ్యాక్సిన్ డోస్‌లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో తొలి విడతలో 5 లక్షల డోస్‌ల వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నాయి అని వైద్యశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి..
Share your comments