రేషన్ కార్డ్ ఉన్నవారికి గమనిక. దేశంలో ఉచిత రేషన్ పొందుతున్న ప్రజలు సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఈ పని చేయలేదంటే వారికి ఉచిత రేషన్ కట్. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశంలో రేషన్ కార్డు నున్న ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయాలని చాలా సార్లు సూచించింది. ఈ రెండిటిని లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో జూన్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
ఇటీవలి ప్రభుత్వం ఈ గడువు తేదిని జూన్ 30 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రజలు అంత్యోదయ అన్న యోజన, ప్రాధాన్యత గృహ పథకాల ప్రయోజనాలను వినియోగించుకోవాలంటే, ఇప్పుడు తప్పనిసరిగా తమ రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సి ఉంది.
రేషన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తులు దానిని తమ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం నిరంతరం కోరడానికి ఇదే కారణం. కాబట్టి ఇకనుండి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ ని రేషన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ చేసినవారు మాత్రమే పొందగలరు. ఈ విధంగా చేసినవారికి ప్రతినెలా రేషన్ సరుకుల్ని ఉచితంగా పొందుతారు.
ఇది కూడా చదవండి..
టమాటా దారిలోనే ఉల్లిపాయలు.. నెలాఖరకు ధరలు భారీగా పెరిగే అవకాశం..
మీ రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేసే ప్రక్రియ పూర్తిగా ఉచితం, దీనికి ప్రభుత్వం ఎటువంటి చార్జీలు వేయట్లేదు. కాబట్టి మీరు కూడా ఈ సర్వీస్ ను ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఉచితంగా పొందొచ్చు. ఈ పనిని ప్రభుత్వం ఎందుకు తప్పనిసరి చేసిందంటే, దేశంలో కొంతమందికి రెండు మూడు రేషకార్డులనేవి ఒకరి పేరు మీదే ఉంటున్నాయి. ఇలాంటి అక్రమాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అంతేకాదు అనర్హులకు రేషన్ కార్డుల్ని తొలగించే వీలుంటుంది.
రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడానికి సమీపంలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలి. ఆన్ లైన్ లో లింక్ చేయడానికి, మీ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేసే లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ అవుతుంది.
మరొకపేవు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తుంది. డిజిటల్ రేషన్ కార్డులను తొలిసారిగా ప్రభుత్వం జారీ చేయబోతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments