కోనసీమలోని లంక ప్రాంతాల గురించి ఆందరికి తెలిసిందే. ఇప్పుడు లంక ప్రాంత రైతులు పొద్దుతిరుగుడు పంటను అక్కడ పండించడం వల్ల ఆ ప్రాంతాలకు మరింత అందం పెరిగింది. సాధారణంగా ఈ లంక భూముల్లో ఎక్కువగా కూరగాయలు, మొక్కజొన్న, అరటి, పోక, కంద ఇలా అనేక రకాల పంటలను పండిస్తారు. కానీ మీరు ఇప్పుడు చూడబోయే ఈ లంక భూముల్లో ముందెన్నడూ అక్కడ పరిచయం లేని పంటను వేసి సక్సెస్ సాధించారు లంక రైతులు. ప్రభుత్వం వారికి ఇచ్చిన లంక భూముల్లో ఆక్వా చెరువుల్లాంటి కాలుష్య భరితమైన పంటలవైపు మళ్లకుండా అందంతోపాటు ఆహ్లాదం, ఆదాయం అందించే ఓ పంట వైపు దృష్టి సారించారు అక్కడి రైతులు.
పి.గన్నవరం మండల పరిధిలోకి బెల్లంపూడి గ్రామ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ పొద్దుతిరుగుడు పంట సక్సెస్‌ఫుల్‌గా సాగు జరుగుతోంది. ఇక్కడ లంక గ్రామాల్లో ఇంచుమించుగా 200 ఎకరాల్లో చాల మంది రైతులు పొద్దుతిరుగుడు వేశారు. ఇప్పుడు ఇక్కడ స్థానిక రైతులు ఒక కంపెనీ సహాయంతో విత్తనాలు, ఇతర పెట్టుబడుల సహకారంతో పొద్దుతిరుగుడు సాగును చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పంట చేతికందే దశకు చేరుకుంది. మరికొన్ని భూముల్లో పంట మొక్కల దశలోనే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడో ఓసారి పొద్దు తిరుగుడు పంట వేసి ఆ పయ్రత్నాన్ని మానుకున్నారట.చాల మంది ప్రజలు ఫోటోషూట్లని ఈ ప్రాంతాలకు వస్తున్నారు.
ఇది కూడా చదవండి..
ఆధునిక పద్దతిలో జొన్న సాగు
ఎకరాకు కనీసం ఆరేడు క్వింటాళ్ల దిగుబడిగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తమ యాజమాన్య పద్దతులు పాటిస్తే 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆనందంగా చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు అవుతుందని వివరిస్తున్నారు. పొద్దు తిరుగుడు పంటతో ఇక్కడ ఉపాధి కూడా లభిస్తుందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు ఇక్కడ ఎక్కువగా మొక్కజన్న పంటనే వేసిన రైతులు ఈసారి పొద్దుతిరుగుడు పంట వేయగా దానికి గిట్టుబాటు ధర రాకనే ప్రయోగాత్మాకంగా ఈ పంటను వేసినట్లు రైతులు తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments