ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం: ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 238 మందికి పైగా మరణించారు మరియు 900 మందికి పైగా గాయపడ్డారు.
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం: కోరమండల ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లు ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగివున్నఒక సరుకు రవాణా రైలు ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది .
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి రైలు పట్టాల లోపమే కారణమని చెబుతున్నారు. దశాబ్ద కాలంలో జరిగిన రైల్వే ప్రమాదంలో ఒకటిగా ఈ రైలుప్రమాదం నిలిచిపోయింది . ఇప్పటికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి . ఇప్పటి వరకు మృతుల సంఖ్య 261 చేరినట్లు అధికారిక సమాచారం .. సహాయక చర్యలు పూర్తయే సరికి మృతుల సంఖ్య పెరిగే అవకాశ వుంది .
ఈ విషయమై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్‌లో మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్‌కు సహాయం చేసేందుకు ఎయిర్‌ఫోర్స్‌ను పిలిపించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.
వినియోగదారులకు శుభవార్త : తగ్గనున్న వంట నూనె ధరలు!
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రైలు ప్రమాదం నేపథ్యంలో ఇప్పటి వరకు 40 రైళ్లను రద్దు చేసినట్లు సమాచారం.
Share your comments