తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారిపోతున్నాయి ఒక్కో రోజు ఒక్కో పార్టీ బలంగా కనిపిస్తుంది . ఇప్పటికె పలువురి చేరికలతో జోష్ మీద వున్నా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే వృద్దాప్య పింఛన్ రూ . 4000 ఇస్తామని ప్రకటించింది దీనితో అధికారి పార్థి కూడా వృద్ధుల ఓట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ కు దీటుగా వృద్దులకు అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. వచ్చే ఎన్నికల్లో ప్రజలను మరోసారి ఆకట్టుకునేలా మెనీఫెస్టో రూపకల్పనపై CM KCR కసరత్తు చేస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే వికలాంగుల పింఛన్ ను రూ.3,016 నుంచి రూ.4.016 పెంచగా, వృద్ధుల, వితంతువుల పెన్షన్ ను రూ.2,016 నుంచి రూ.3,106 పెంచనున్నట్లు పేర్కొంటున్నారు. గృహలక్ష్మి, దళిత బంధు పథకాల పరిధిని విస్తరిస్తారని సమాచారం. విపక్షాలకు ధీటుగా కొత్త పథకాలను మెనీ ఫెస్టోలో రెడీ చేస్తున్నట్లు సమాచారం.
రైతులకు ముఖ్య గమనిక.. ఈ నెల 10 నుండి 'రైతు బీమా' పథకానికి దరఖాస్తులు ప్రారంభం..
ప్రజలు మాత్రం ఉచిత హామీలకంటే విద్య ,వైద్యంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని , తెలంగాణాలో వచ్చే ఏ ప్రభుత్వాలైన అధిక ఉచిత హామీలను ప్రకటించకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ విధి విధానాలను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు ధనికులకు మేలుచేసే విధంగా ఉన్నాయని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
Share your comments