News

రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడేది అప్పుడే?

KJ Staff
KJ Staff

రైతులకు చేయూత అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకంతో పాటు ఉచిత పంటల బీమా, రైతులకు ఉచితంగా బీమా అందిస్తోంది. ఇక సబ్సిడీ ధరతో విత్తనాలు అందించడంతో పాటు సబ్సిడీ ధరపై రైతులకు బోర్లు వేయిస్తోంది. దీంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక పథకాలు అందిస్తోంది.

అయితే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ.7,500 ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ నగదును నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుండగా.. ఈ ఏడాది నగదును మే 13న రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోనివారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

ఏప్రిల్ 30లోపు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మే 5 నుంచి లబ్ధిదారుల జాబితాను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో.. లేదో రైతులు తెలుసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే మే 13న ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.

అప్లై చేసుకోవడం ఎలా?

-గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు

-గ్రామ, వార్డు వలంటీర్లకు రైతు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను ఇవ్వాలి. వాళ్లే గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లయ్ చేస్తారు.

డబ్బులు పడ్డాయో.. లేదో.. తెలుసుకోవడం ఎలా?

-రైతు భరోసా వెబ్‌సైట్ https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.htmlను వీక్షించండి
-ఆ తర్వాత నో యువర్ రైతు భరోసా స్టేటస్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే.. మీకు డబ్బులు పడ్డాయో.. లేదో తెలుస్తుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More