నేటి ఆధునిక యుగం మనిషి జీవనానికి ముఖ్యమైన వ్యవసాయ వృత్తిని అన్ని రంగాలకు సమానంగా అభివృద్ధి చేయలేకపోయింది. కానీ నేటి సాంకేతిక యుగం చదువులు నుండి అంతరిక్షజ్ఞానం వరకు ఎదిగిపోయింది. ప్రాపంచ వేదికలు ఆహార భద్రతలు చాల అవసరమని చెబుతున్నా ఆ విషయాన్నీ నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నేటి యువతను వ్యవసాయం దిశగా మళ్లించేందుకు వన్డే ఫార్మింగ్, ఫార్మ్ టూరిజం అని వినూత్న కార్యక్రమాలను నగర ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నగర చివర ప్రాంతంలో 'సాయిల్ ఈజ్ అవర్ సోల్ ' అనే వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించారు.
ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఘట్కేసర్ దగ్గరలో 18 ఎకరాల్లో మొదలుపెట్టారు. ఈ క్షేత్రంలో ఐటీ రంగంలో అవగాహనమున్న మురళీధరరావు, అగ్రికల్చర్ బీటెక్ చదివిన రాకేశ్ మరియు శ్రీనివాస్ అనే యువ కర్షకులు నతురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ క్షేత్రంలో వారితో పాటు తృణధాన్యాలు, పప్పుదినుసులు, ఫలాలు, కూరగాయలు మొదలు సాగు చేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని మూడేళ్లు కష్టపడి వ్యవసాయాన్ని విద్యగా మార్చాలని, యువతను వ్యవసాయం వైపు తీసుకురావాలనే సంకల్పంతో తయారు చేసారు.
వన్ డే ఫార్మింగ్లో భాగంగా వరినాట్లు వేయడం, నీటి పారుదల, కలుపుతీయడం, కూరగాయలు తుంచడం, చీడపీడల నివారణ తదితరాలను వివరిస్తూ రోజంతా రైతు పడే కష్టాన్ని వివరిస్తారు. ఈ ఫామ్ టూరిజం కోసం పలు ఐటీ కంపెనీల నుంచి పలువురు వీకెండ్ సెలవుల్లో ఇక్కడ వాలిపోతున్నారు.
ఇది కూడా చదవండి..
మదనపల్లెలో కాశ్మిరీ కుంకుమపువ్వు సాగు ..
ఈ క్షేత్రానికి నగర పాఠశాల విద్యార్థులను తీస్కువచ్చి పంటలు పండే విధానంపై వారికీ అవగాహనా కల్పిస్తారు. తమ విద్యార్థులను ప్రాజెక్టులో భాగముగా పాఠశాల యాజమాన్యం ఇక్కడికి తీసుకువస్తున్నాయి. వ్యవసాయ డిప్లొమా, అగ్రికల్చర్ బీటెక్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని ఇంటర్న్షిప్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు.
ఈ క్షేత్రంలో రసాయనాలు వాడకుండా కూర గాయలు, వరి, పసుపు, అల్లం, కంది, కుసుమ వంటి పంటలను సాగు చేస్తున్నారు. . అదేవిధముగా వీటితోపాటు పనస, ఉసిరి, సీతాఫలాలం, మామిడి, జామ, సపోట అలాగే టేకు, మహాగని, సాండిల్ - రోజ్ వుడ్ వంటి కలప మొక్కలనూ పెంచుతున్నారు. సమీకృత వ్యవసాయంలో భాగంగా ఆవులు, కోళ్లు, కుందేళ్లు, చేపలు పెంచుతూ.. వీటి ద్వారా వచ్చే ఎరువులను సేంద్రియ ఎరువులుగా వినియోగిస్తున్నారు. నగరానికి చెందిన యువత ఈవిధముగా వ్యవసాయంలో అద్భుతమైన జీవితం ఉందని నిరూపిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments