News

PMFME పథకం కింద MOFPI ద్వారా ఒక జిల్లా ఒకే పంటపై వర్క్ షాప్ !

Srikanth B
Srikanth B
ఒక జిల్లా ఒకే పంట!
ఒక జిల్లా ఒకే పంట!

ప్రచారంలో భాగంగా, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకం కింద ఒక జిల్లా ఒకే పంట అనే అంశం పై  వర్క్ షాప్ ను నిర్వహించింది .

జమ్మూ కాశ్మీర్‌లోని హార్టికల్చర్ (ప్లానింగ్ అండ్ మార్కెటింగ్) డైరెక్టర్ విశేష్ పాల్ మహాజన్ ప్రారంభోపన్యాసం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక గ వున్నా   మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం యొక్క ప్రాముఖ్యతను, అలాగే PMFME పథకం ద్వారా భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన నొక్కి చెప్పారు. కిష్త్వార్ జిల్లా నోడల్ అధికారి సునీల్ సింగ్ ఈ కార్యక్రమానికి మోడరేట్ చేశారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలతో ముందుకు వస్తున్నాయి అని అశోక్ కుమార్ శర్మ, Dy. కమీషనర్, కిష్త్వార్, విశిష్ట వక్తలలో ఒకరు. డాక్టర్ బ్రిజ్ పాల్ SMS (PP), ఉద్యానవన శాఖ, కిష్త్వార్, జిల్లాకు ODOP యొక్క ఔచిత్యాన్ని గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్ కిష్త్వార్ మాట్లాడుతూ, ఈ రైతుల ఆదాయాన్ని పెంచడానికి పండ్ల తోటల పెంపకందారులు/రైతులు ముందుకు వచ్చి శాఖలు రూపొందించిన పథకాల అమలులో క్రియాశీల పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు.

డిప్యూటి కమీషనర్ కిష్త్వార్ ప్రకారం జిల్లాలో మోడల్ "మార్కెట్ " స్థాపనపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో జాతీయ రహదారి వెంబడి 50 మోడల్ మార్కెట్ ల ఏర్పాటుకు గుర్తించామని, దీని ద్వారా ఉత్పత్తి ప్రదర్శన, విక్రయం, మార్కెటింగ్‌కు ఉమ్మడి వేదిక ఉంటుందని, అలాగే రైతులకు జాతీయ స్థాయిలో అందజేస్తామన్నారు.

మిరపలో నారుకుళ్ళు తెగులు యాజమాన్య పద్ధతులు

Share your comments

Subscribe Magazine

More on News

More