మార్కెట్లో ఉల్లి ధర ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఉల్లి రైతులు నష్టానికి గురవుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలో నెలరోజులుగా ఉల్లి ధర క్వింటాల్ రూ.500 నుంచి రూ.800 మాత్రమే ఉంది. మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్ర సంగతికి వస్తే అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా తయారయింది. ఉల్లిని అమ్ముదాం అని రైతులు మార్కెట్లకు తరలించిన అక్కడ కొనేవాళ్లే కనిపించడంలేదు. అధిక వర్షాలకు, చీడపీడలు ఆశించి ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిందని ఆందోళన చెందుతున్న రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి ధర కూడా రావట్లేదని దిగులు చెందుతున్నారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఉల్లి ధర కిలోకి రూ.2 నుండి రూ.4 మాత్రమే పలుకుతుంది, మార్కెట్ కి వచ్చేసరికి అదే కిలో ఉల్లిని రూ.20 నుంచి 30 వరకు అమ్ముతున్నారు. ప్రతిరోజు ఇక్కడి మార్కెట్కి దాదాపుగా 80 లారీల ఉల్లి అనేది వస్తుంది. గతంతో పోలుచుకుంటే ప్రస్తుతం తిగుమతులు పెరిగాయి, అయినప్పటికీ ధరలు మాత్రం పెంచట్లేదు.
దేశంలో ఉపయోగించే ఉల్లిలో ఎక్కువ శాతం మహారాష్ట్రలోనే పండిస్తారు. ఇక్కడ ధరలు తగ్గుతున్న కూడా వేరే ప్రదేశాల్లో ధరలు తగ్గించకుండా ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. దీనిని నియంత్రించవలసిన మార్కీటింగ్ శాఖ కూడా వీటిని పట్టించుకోవట్లేదు. వ్యాపారులు సిండికేట్లుగా మారి ఉల్లిని నిల్వ చేసి వీటి ధరలను మరింత పెంచుతున్నారు.
ఇది కూడా చదవండి..
మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు..
ఉల్లి ధర తక్కువ ఉన్న కూడా నగర మార్కెట్లో ధర పెరగానికి గల కారణం వచ్చేసి, ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి ముందుగానే సరుకు కొనేసి నగరానికి తీసుకురాకుండా వారి గోదాముల్లోనే నిల్వలు ఉంచుతున్నారు. దీనితో నగర మార్కెట్లోకి సరుకు రాకపోవడంతో, సరఫరా లేదనుకుని ధరలు పెరుగుతున్నాయి. కానీ కష్టపడి పండించిన రైతులకు మాత్రం లాభాలు లేఖ నష్టాల పాలవుతున్నారు. ఈవిధంగా ఇక్కడ వ్యాపారులు సిండికేట్లుగా మారి ఉల్లి ధరలను పెంచుతున్నారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో పండించిన ఉల్లిని మాత్రమే మార్కెట్ లోకి విక్రయిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఉల్లి సరుకు ముగిస్తే, అప్పుడు మహారాష్ట్ర గోదాముల్లో నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్ లోకి ఎక్కువ ధరలకు విక్రయిస్తారు. మహారాష్ట్రలో ఉల్లి ధర కేవలం రూ. 2-4ఉండగా వ్యాపారులు ఆ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలో ఉల్లిని రూ.25-30కి అమ్మి ఎక్కువ లాభాలను గడిస్తున్నారు. దీనితో ఉల్లి ధరలు నగర మార్కెట్ లో ఆకాశాన్ని అంటున్నప్పటకి రైతులకు లాభాలు లేవు.
ఇది కూడా చదవండి..
Share your comments