దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది దీనితో రానున్న రోజులలో టమాటో లగే ఇతర కూరగాయల ధరలు పెరగనున్నట్లు కొన్ని మార్కెట్ ఇంటలిజెన్స్ కమిటీలు అంచనా వేస్తున్నాయి కేవలం టమాటో మాత్రమే కాకుండా టమాటో మాదిరిగా వంటకాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన ఉల్లి ధరలు కూడా వచ్చే నెల లేదా ఈ నెల చివరి నాటికీ ధరలు పెరిగే అవకాశాలు వున్నాయి.
ఈ సమయంలోనే మరో సారి వారిలో ఆందోళన మొదటైంది. ఇప్పటికే టమాటా సామాన్యుల వైపు కన్నెర్ర చేయగా ఉల్లి రానున్న కాలంలో కన్నీళ్లు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి 70 వరకు పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది.
అమరావతి రైతులకు శుభవార్త.. త్వరలోనే డబ్బులు జమ..
ఉల్లి ధరలు ఈ నెలాఖరు వరకు పెరుగుతూ సెప్టెంబర్ నాటికి 60 నుంచి 70 రూపాయల వరకు చేరవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్ తెలిపింది. 2020 సంవత్సరం నాటికి ధరల కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సరఫరా డిమాండ్ అసమతౌల్యం ఆగస్టు చివరి నాటికి కనిపించవచ్చని అంచనా.
Share your comments