తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు తాకిన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించక పోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి , రాష్ట్రాలలో ఇప్పటికి వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి , ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనానికి రుతుపవనాలు ఎండ తీవ్రత నుంచి ఉపశమని ఇస్తాయని భావించగ రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించకపోవడంతో జనాలు వడగాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరో వైపు రానున్న రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని వాతావణ శాఖ తాజాగా వెల్లడించింది. నేడు రేపు రానున్న రెండు రోజులపాటు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ..అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దాహం లేకపోయినా మంచి నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించింది.
జూన్ నెల మూడవ వారంలో కూడా నిప్పుల కొలిమిలా మండుతుంది , తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, తీవ్రమైన ఎండలతో మండి పోతున్న రుతుపవనాల విస్తరణ 10వ తేదీ నాటికి కర్ణాటక, ఏపీలోని రాయలసీమకు విస్తరించాయి. ఆ వెంటనే తెలంగాణకు రావాలి. కానీ, అక్కడినుంచి వాటి పురోగతి లేదు.
500 నోట్ల మాయంపై ఆర్బీఐ వివరణ..
విస్తరించని రుతుపవనాలు:ఏపీలోకీ ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. ఆ రాష్ట్రమంతా విస్తరించకుండా ఉసూరనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు సోమవారం రుతుపవనాలు విస్తరిస్తాయని ఏపీలోని వాతావరణ శాఖ తొలుత ప్రకటించింది.
నేడు, రేపు ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను చేరే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. వాస్తవానికి తమిళనాడు, కేరళ తీరాన్ని ఈ నెల 8-9 తేదీల్లోనే తాకాయి.
Share your comments