రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు రాష్ట్రంలో 40 డిగ్రీల ఎండలతో సూర్యుడు మండిపడుతుంతుంటే, తెల్లవారుజాము నుండి వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోత సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళకు గురువవుతున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు దెబ్బతినడంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను వరి పంట చేతికందే సమయంలో వడగళ్ల వాన భయం వెంటాడుతోంది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా అంచనా వేసింది. ద్రోణి వాతావరణ వ్యవస్థ ఉత్తర కర్ణాటక నుండి తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని, ఆది, సోమ, మంగళవారాల్లో వివిధ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ సూచన వెల్లడించింది. రైతులు తమ వ్యవసాయ పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, మరియు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ తెలిపింది. అదనంగా, కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశమున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో భైంసా డివిజన్‌లోని కొన్ని మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలుచోట్ల నేలకొరిగిన మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..
మహిళలకు శుభవార్త: మహిళలకు రూ.2 వేలు విలువ చేసే న్యూట్రిషన్ కిట్లు..
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు మరియు వడగళ్ల వానలు వరి పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి, భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా గతంలో ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసిపోయింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన వరి పంటను నాశనం చేసి పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు అనేక కారకాల కలయికే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. "సాధారణంగా, ఉపరితలం వేడెక్కడం వల్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నప్పుడు, గాలిలో తేమ శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు మేఘాలు ఏర్పడటం వల్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి" అని భారత వాతావరణ శాఖ (IMD) సీనియర్ అధికారి వివరించారు.
ఇది కూడా చదవండి..
Share your comments