రాష్ట్రంలోని అన్ని ప్రధాన గ్రామాలలో ఇటీవల 5,000 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి.పెద్ద ఎత్తున వరి కొనుగోలు జరుగుతుంది. డిమాండ్‌ను బట్టి మే 10 నాటికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను 7 వేలకు విస్తరించదానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
యాసంగి సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్లకు రైతులకు కనీస మద్దతు ధర (minimum support price) చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బ్యాంకుల నుంచి రూ.15,000 కోట్ల రుణాన్ని పొందింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీ కారణంగా టీఎస్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్(TS Civil Supplies Corporation) రుణాన్ని పొందగలిగింది.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన గ్రామాలలో ఇటీవల 5,000 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. పెద్ద ఎత్తున వరి కొనుగోలు జరుగుతుంది. డిమాండ్‌ను బట్టి మే 10 నాటికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను 7 వేలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది జూన్ 15 నాటికి మొత్తం వరి సేకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక వేస్తుంది.
కొనుగోలు చేసిన వారం రోజుల్లోగా క్వింటాల్‌కు రూ.1,960 కనీస మద్దతు ధర (minimum support price) నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.
రబీలో దాదాపు 65 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) జిల్లాల్లో మునుపటి వర్షాకాల వరి నిల్వలను ఇంకా క్లియర్ చేయనందున ప్రభుత్వం తీవ్రమైన గోడౌన్ స్థల కొరతను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి.
గత సంవత్సరం, కోవిడ్ నియంత్రణల కారణంగా మూసివేయబడిన ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లు మరియు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర సంస్థలలో ప్రభుత్వం వరిని నిల్వ చేసింది, అయితే కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ఇప్పుడు వీలు పడదు.
వర్షాకాలం పంటలో ప్రతి క్వింటాల్ బియ్యానికి 65 కిలోల ముడి బియ్యం ఉత్పత్తి అయితే రబీలో 32 కిలోల ముడి బియ్యం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఈ నష్టాన్ని నివారించడానికి, మిల్లర్లు 65 కిలోల పారా బాయిల్డ్ వరిని ఉత్పత్తి చేయడాన్ని ఎంచుకున్నారు.
మరిన్ని చదవండి
Share your comments