పాకిస్థాన్ ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది , 11 కిలోల గృహ వినియోగ గ్యాస్ ధర 2050 రూపాయలు ఉండగా కమర్షియల్ గ్యాస్ 42 కిలోలు ధర ఏకంగా 9084 రూపాయలకు పెరిగింది . అదేవిధంగా ఫారెక్స్ రిజర్వు 16. 5 బిలియన్ నుంచి 5. 6 బిలియన్ లకు పడిపోవడంతో అధికమొత్తం లో దిగుమతులు చేసుకొనే స్థితిలో పాకిస్థాన్ లేదు దీనితో ఖర్చులను తగ్గించుకొనే మార్గంగా రాత్రి 8 తరువాత షాపింగ్ మాల్ , గుడి లను మూసివేసి విద్యుత్ ను ఆదాచేస్తుంది .
.
ఇక అక్టోబర్ నెలలో పాకిస్తాన్ వరదలు ఆ దేశాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఈ వరదల వల్ల 3.3 కోట్ల ప్రజలు బాధపడుతున్నారు. 30 బిలియన్ డాలర్ల మేర నష్టం ఏర్పడింది. వ్యవసాయం దెబ్బతింది. దీంతో పాకిస్తాన్ పూర్తిగా దిగుమతులపై ఆధారపడింది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, డిసెంబర్ 2022లో దేశ వాణిజ్య లోటు 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 16 శాతం తగ్గి 2.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డాలర్ తో పోలిస్తే పాక్ రూపాయి 30 శాతం పతనం అయింది. జూన్ 2023 వరకు 30 బిలియన్ డాలర్ల విదేశీ అప్పును పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది. దేశ జీడీపీ వృద్ధి 2 శాతం మాత్రమే ఉంది. 2021 నాటికి పాకిస్తాన్ మొత్తం విదేశీ రుణం 130.433 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ పరిస్తితుల నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
07 శనివారం 2023 నాటికీ మార్కెట్లో కూరగాయల ధరలు ...
ప్రస్తుతం పాకిస్థాన్ యొక్క ద్రవ్యోల్బణం 24. 5 గ ఉంది దీనితో అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి . ద్రవ్యోల్బణం ఇలాగే పెరిగితే శ్రీలంక పరిస్థితులు పాకిస్తాన్ లో పునరావృతం కాబోతున్నాయి.
పిండి, పంచదార, నెయ్యి, ఇలా నిత్యావసరాల ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెండు వారాల్లోనే 15 కిలోల పిండి ధర పాకిస్తాన్ రూ. 300 పెరిగి రూ. 2050కి చేరింది. చెక్కర, నెయ్యి ధరలు 25 శాతం నుంచి 62 శాతానికి పెరిగాయి. దీనికి తోడు ఇంధన కష్టాలు పాక్ పరిస్థితిని దిగజారుస్తున్నాయి. ఇంధన బిల్లలు తగ్గించుకునేందుకు కరెంట్ ను ఆదా చేస్తున్నారు. ఇంధన వినియోగాన్ని 30 శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీని వల్ల దేశానికి 274 మిలియన్ డాలర్లు ఆదా అవుతుందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఆ దేశ ప్రధాని IMF నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు . పెరుగుతున్న ఖర్చులతో పాటు టాక్స్ పెంచితే గని ఆదేశానికి IMF ఆర్థిక సహాయం అందించే పరిస్థితే లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు . IMF నుంచి నిధులు ఆలస్యం అయేకొద్దీ ఆదేశము మరింత సంక్షోభం లో కూరుకుపోయే పరిస్థితి ముంచుకొస్తుంది .
Share your comments