News

ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ కు జీవిత ఖైదు విధించినందుకు పాకిస్తాన్ స్పందన!

S Vinay
S Vinay

ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించడాన్ని పాకిస్తాన్ ఖండించింది.పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ రోజును భారత ప్రజాస్వామ్యానికి 'బ్లాక్ డే'గా అభివర్ణించారు.

కాశ్మీరీ పండిట్ల ఊచకోత ప్రధాన ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ కు జీవిత ఖైదు విధించినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ రోజును భారత ప్రజాస్వామ్యానికి 'బ్లాక్ డే'గా అభివర్ణించారు.విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, 'మన కాశ్మీరీ సోదరులు మరియు సోదరీమణులకు' నా మద్దతు' అందిస్తానని వ్యాఖ్యానించారు.భారతదేశం యాసిన్ మాలిక్‌ను భౌతికంగా ఖైదు చేయగలదు, కానీ అతని ఆలోచనను అది ఎన్నటికీ నిర్బంధించదు అని విషం కక్కారు.

యాసిన్ మలిక్‌కు రెండు వేర్వేరు కేసుల్లో జీవిత ఖైదు విధించారని ఆయన న్యాయవాది ఉమేశ్ శర్మ చెప్పారు. అంతే కాకుండా పది కేసుల్లో శిక్ష వేశారని వీటితో పాటు యాసిన్ మలిక్‌కు రూ.10 లక్షల జరిమానా కూడా విధించారని చెప్పారు.

షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి పిపిపికి చెందిన బిలావల్ భుట్టో జర్దారీ, మాలిక్‌కు 'బూటకపు' విచారణలో 'అన్యాయమైన' శిక్షను వేశారని అన్నారు. కాశ్మీరీల గొంతును భారతదేశం ఎప్పటికీ నిశ్శబ్దం చేయదు, కాశ్మీరీ సోదరులు మరియు సోదరీమణులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుంది, వారి న్యాయమైన పోరాటానికి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తూనే ఉంటుందని ఎప్పటి లాగే మొసలి కన్నీరు కార్చారు.

ఒకవైపు చేసిన తప్పులను తనే ఒప్పుకున్నాడు కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ మాలిక్ అయినప్పటికీ ఈ దాయాది దేశ అంతర్యం ఏంటనేది అంతు చిక్క కుండా ఉంది.

మరిన్ని చదవండి.

స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఫిక్షనల్, డాగ్ మ్యానే ఒరిజినల్!

ఇప్పుడు వాట్సాప్‌లో తక్షణమే హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంకు!

Related Topics

yasin malik terrorist

Share your comments

Subscribe Magazine

More on News

More