ఒక అంచనా ప్రకారం రాబోయే ఒక సంవత్సరానికి కనీస అవసరాల కంటే ఎక్కువగా ధాన్యం నిలువలు ఉన్నాయని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ముఖ్య అధికారి తెలిపారు.
ఒక సమావేశంలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ముఖ్య అధికారి, శ్రీ సుధాన్షు పాండే మాట్లాడుతూ, రాబోయే సంవత్సరంలో సంక్షేమ పథకాల అవసరాన్ని పూర్తి చేసిన తర్వాత, ఏప్రిల్ 1, 2023న, భారతదేశంలో 80 LMT గోధుమల నిల్వలు ఉంటాయని, ఇది కనీస అవసరాలైన 75 LMT కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. 1050 LMT ఉత్పత్తిని అంచనా వేసినప్పటికీ భారతదేశం మిగులు గోధుమలను కలిగి ఉంటుంది, FY 23లో ప్రాథమిక అంచనా అయిన 1110 LMT కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.
గోధుమల సేకరణ తక్కువగా ఉండటంపై అడిగిన ప్రశ్నకు సుధాన్షు పాండే సమాధానమిస్తూ, అధిక మార్కెట్ ధరల కారణంగా, రైతులకు మేలు చేసే MSP (కనీస మద్దతు ధర) కంటే ఎక్కువ ధరకు వ్యాపారులు పెద్ద మొత్తంలో గోధుమలను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. “ఈ సంవత్సరం మార్కెట్ ధరల పెరుగుదల మరియు దేశీయ మరియు ఎగుమతి ప్రయోజనాల కోసం ప్రైవేట్ ప్లేయర్‌ల నుండి అధిక డిమాండ్ కారణంగా, ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా కొనుగోలు తక్కువగా ఉంది. అయితే అది రైతులకు అనుకూలంగా ఉంటుంది. రైతులు గోధుమలకు మంచి ధర లభిస్తోంది, ”అని కార్యదర్శి చెప్పారు.
ఇంతకుముందు రైతులు ప్రభుత్వానికి అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. “ఇప్పుడు, వారు ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయించలేని ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వ సేకరణ తగ్గిందని అన్నారాయన.
వరి మిగులు లభ్యతపై కూడా కార్యదర్శి మాట్లాడారు. గత సంవత్సరం వరి సేకరణ సుమారు 600 లక్షల మిలియన్ టన్నులు.కాగా, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆయన అన్నారు. National Food Security Act కోసం వార్షిక అవసరం దాదాపు 350 LMT. కాగా పెద్ద మొత్తంలో నిల్వ ధాన్యం అందుబాటులో ఉంది.వచ్చే ఏడాది నుంచి మొత్తం ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని, మిగులు బియ్యం నిల్వలతో మనం అనుకూలమైన పరిస్థితిలో ఉన్నామని ఆయన తెలిపారు.
గోధుమల ఎగుమతి.
గోధుమ ఎగుమతుల గురించి మాట్లాడుతూ, శ్రీ సుధాన్షు పాండే మాట్లాడుతూ, ఇప్పటి వరకు 40 LMT గోధుమలు ఎగుమతి కోసం ఒప్పందం కుదిరిందని మరియు ఏప్రిల్ 2022లో సుమారు 11 LMT ఎగుమతి చేయబడిందని ఆయన తెలిపారు. ఈజిప్టు తర్వాత, టర్కీ కూడా భారత గోధుమల దిగుమతికి అనుమతినిచ్చిందని ఆయన తెలియజేశారు. జూన్ నుండి అర్జెంటీనా మరియు ఆస్ట్రేలియా నుండి గోధుమలు అంతర్జాతీయ మార్కెట్లలోకి రావడం ప్రారంభిస్తుందని, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లలో గోధుమలను విక్రయించడానికి ఎగుమతిదారులకు ఇదే సరైన సమయమని శ్రీ పాండే చెప్పారు.
మరిన్ని చదవండి.
Share your comments