మొన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కసారిగా సెంచరీ చేరువకు చేరుకోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడిపోయారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం సరకు రవాణాపై పడి అన్ని ధరలు పెరిగే అవకాశముంది. అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగంపై కూడా దీని ప్రభావం ఉంటుంది.
అయితే ఎట్టకేలకు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు కిందకు దిగొస్తున్నాయి. దీంతో వాహనదారులతో పాటు ప్రజల ఊపిరిపీల్చుకుంటున్నారు. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తుండగా.. మంగళవారం కూడా ఇంధన ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. లీటర్ పెట్రోల్‌పై 19 నుంచి 22 పైసలు తగ్గగా.. డీజిల్‌పై 21 నుంచి 23 పైసలు తగ్గాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోవడం, యూరప్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మళ్లీ లాక్‌డౌన్ విధించడంతో ఇంధనానికి డిమాండ్ పడిపోవడమే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.
ధరలు తగ్గిన తర్వాత... ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.94.16, డీజిల్ రూ.88.20గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.50, డీజిల్ రూ.80.87గా ఉంది.
Share your comments