e-కిసాన్ ఉపజ్ నిధి డిజిటల్ గేట్ వే పోర్టల్ ను ప్రారంభించిన, యూనియన్ మినిస్టర్ ఫర్ కన్సుమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ , టెక్స్టైల్స్ , పీయూష్ గోయల్ లాంచ్ చేసారు. ఈ పోర్టల్ ద్వారా భారత దేశం 2047 సంవత్సరానికి సాదించాలి అనుకున్న వికసిత భారత్ కల నెరవేరుతుంది అని ఆశిస్తున్నారు. భారతీయ ఆర్ధిక వ్యవస్థలో ప్రగతిలో వ్యవసాయం అతిముఖ్య పాత్ర పోషిస్తుంది. 'e-కిసాన్ ఉపాజ్ నిధి' ద్వారా అగ్రికల్చర్ లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విధానాల్లో పెను మార్పులు రాబోతున్నాయి.
పోర్టల్ లాంచింగ్ తో పాటు, పీయూష్ గోయాల్ మరొక్క కీలక ప్రకటన చేసారు. ఇక నుండి రైతులు, తమ ఉతప్తులను వేర్హౌస్ లో నిల్వ చేసుకోవడానికి చెల్లించవలసిన 3% సెక్యూరిటీ డిపాజిట్ ను 1% శాతం చెల్లిస్తే చాలు. ఈ ప్రకటన ద్వారా చిన్నపాటి రైతులు కూడా లబ్ది పొందుతారు. సెక్యూరిటీ డిపోసిట్గా చెయ్యవలిసిన డబ్బును కుదించడం ద్వారా ఎక్కువ మంది రైతులు తమ పంటను వేరె హౌస్లో నిల్వ చేసుకునేందుకు మక్కువ చూపుతారు. తద్వారా పంట నష్టం తగ్గి, ఆహార భద్రత నియంత్రించ్చబడుతుంది. రైతులు తమ పండించిన పంటను, WDRA ద్వారా రిజిస్టర్ చెయ్యబడిన ఏ స్టోరేజ్ హౌస్లో అయినా సరే 6 నెలల పాటు పంటను నిల్వ చేసుకోవచ్చు. రైతులు వారి పంటలకు మార్కెట్లో ఆశించిన లాభం వచ్చేవారుకూ నిల్వ ఉంచి, ఎక్కువ ధర పలికినప్పుడు వారి ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.
Share your comments