రైతులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నం అయ్యింది. ప్రధాన మంత్రి క్రిషి సమ్మాన్ నిధి డబ్బులు మీ అకౌంట్లలోకి అతి త్వరలోనే..
PM కిసాన్ 16 వ విడత ఎప్పుడు తమ అకౌంట్లలో పడతాయి అని రైతులు అందరూ ఎదురుచుస్తున్న సమయంలో, కేంద్రం తీపి కబురుని అందించింది. ఫిబ్రవరి 27, 2024న, మహారాష్ట్ర, యావట్మాల్ నుండి ఈ నగదు సహాయాన్ని అందచేస్తునట్టు, తెల్సుతుంది. వ్యవసాయానికి కావాల్సిన ఆర్ధిక సహకారాన్ని అందించి, వారికీ కావాల్సిన వ్యవసాయ అవసరాలు తిర్చి, భారతీయ వ్యవసాయాన్ని బలపరచడమే ఈ స్కీం ముఖ్య ఉదేశ్యం.
మీ కాతాలో పడిన డబ్బును పొందడం ఎలా.
మీ దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్లకు (CSCs) లను సంప్రదించి, డిజిపే సాయంతో మీ డబ్బును పొందవచ్చు. లేకుంటే ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ప్రారంభించిన "అపీకే బాంక్ ఆపికే ద్వార్ " అనే కాంపెయిన్ ద్వారా మీ ఇంటి వద్ద నుండే మీ ఆధార్ కార్డు తో లింక్ అయ్యి ఉన్న బ్యాంకు అకౌంట్ నుండి డబ్బును పొందవచ్చు.
PM కిసాన్ స్కీం కు అర్హులు:
ఐదు సంవత్సరాల ముందు ప్రారంభించిన, ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి దేశములో 11కోట్ల రైతులకు లబ్ధిని చేకూరుస్తుంది. అయితే ఈ స్కీం కు అర్హత సాధించడానికి కొన్ని షరతులు ఉన్నాయ్. అవి ఏమిటో తెల్సుకుందాం.
రైతులు తమ సొంత పొలాల్ని కలిగి ఉండాలి.
స్థలం యాజమాన్యాన్ని తెలియపరిచే దస్తావేజులు అన్ని దగ్గర పెట్టుకోవాలి.
PM కిసాన్ నిధి స్టేటస్ ను తెలుసుకోవడం ఎలా..
ముందుగా PM కిసాన్ ఆఫిసిఅల్ వెబ్సైటు ను విసిట్ చెయ్యండి లేదా ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి pmkisan.gov.in
మీకు కావాల్సిన భాషను ఎంచుకోండి.
తర్వాత స్టేటస్ అనే లింక్ పై క్లిక్ చెయ్యండి.
తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న కోడ్ ని ఎంటర్ చేసి గెట్ ఓటిపి పై క్లిక్ చేసి ఓటీపీ ని ఎంటర్ చెయ్యవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసాక మీకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు
Share your comments