సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
గురువారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. 11 వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ దేశం 5 వ స్థానానికి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో 3 వ స్థానానికి చేరుకుంటుందన్నారు.
రైతులకి కిసాన్ సమ్మన్ యోజన ద్వారా రు. 6వేలు రూపాయిలు మూడు విడతలుగా కేంద్రం అందిస్తుందని, 17 వ విడత రైతులకి అందించడం జరిగిందన్నారు. దీంతో 3 లక్షల కోట్ల రూపాయలతో 12 కోట్ల రైతులకి లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు.
సహకార రంగం పునర్జీవించడం చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.ఉల్లి ఎగుమతి పన్ను శాతం 40 నుండి 20 శాతం తగ్గించడం జరిగిందని, క్రుడ్ పామాయిల్, సోయా నూనె 32 శాతానికి పెంచారన్నారు. హార్టి కల్చర్ కి ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారని, టాక్స్ ఎక్సింప్షన్ రు. 7 లక్షలు వరకు పెంచడం వలన, మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభం అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజాన ద్వారా రు.4.70 లక్షల కోట్లు మంజూరు చేశారన్నారు.ఇళ్లపై సోలార్ ప్యానెల్ కి కేంద్రం సహకారం అందిస్తుందని, 35 సంవత్సరాల వారు 60 శాతం భారత్ లో ఉన్నారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ ఏ రంగాల్లో ఏ స్కిల్ కావాలో స్కిల్ ట్రైనింగ్ అందించడం, ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 4 కోట్ల యువతకి ట్రైనింగ్ అందించే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు.
Share your comments