ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన: రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయంగా 6000 అందించే పథకం ఇప్పుడు ఔత్సాహికుల నుంచి పీఎం కిసాన్ థీమ్ పై లోగో డిజైన్ కాంటెస్ట్ ను నిర్వహిస్తుంది, లోగో డిజైన్ పై మంచి పట్టుఉండి నైపుణ్యం కల్గిన ఎవరైనా ఈ పీఎం కిసాన్ లోగో కాంటెస్ట్ లో పాల్గొని రూ. 11 వేలు బహుమతిని గెలుచుకోవచ్చు .
పీఎం కిసాన్ లోగో కాంటెస్ట్ లో పాల్గొనాలి అనుకునే వారు www.pmkisan.com వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకొని మీరు సృష్టించిన లోగో ను అక్కడ సబ్మిట్ చేయాలి , లోగో ను డిజైన్ చేసేవారు పీఎం కిసాన్ సాధించిన విజయాలు , రైతులకు పీఎం కిసాన్ ఏ విధంగా ఉపయోగపడింది , పీఎం కిసాన్ ను రైతులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అనే థీమ్ పై లోగోను డిజైన్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ జూన్ 14 న ప్రారంభమై జూన్ 30 తో ముగుస్తాయి కావున ఆశక్తి కల్గిన వారు జూన్ 30 లోగ లోగో డిజైన్ చేసి www.pmkisan.com వెబ్సైటు ద్వారా సమర్పించాలి .
పీఎం కిసాన్ పథకం :
రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి కనీస పెట్టుబడి సాయంగా రూ . 6000 అందిస్తుంది. ఫిబ్రవరి 1, 2019న 2019 మధ్యంతర కేంద్ర బడ్జెట్ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ పీఎం-కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.
రైతులకు పంట నష్ట పరిహారంగా 1.71 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ప్రభుత్వం..
PM-కిసాన్ వార్షిక వ్యయం రూ. 75,000 కోట్లు. ఈ పథకంలో ప్రతి రైతుకు రూ. మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి 6000, నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు పంపబడతాయి. దాదాపు 8 కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.16,000 కోట్లు పంపిణీ చేసింది.
Share your comments