దేశంలోని చిన్న సన్నకారు రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో వ్యవసాయంలో వారికి తోడుగా నిలవడానికి పెట్టుబడి సాయంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న పథకం "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన".
పీఎం కిసాన్ పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి వారి భూమి పరిమాణంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 6,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే ఈ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారిగా రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 8 విడుతల్లో అంటే ఒక రైతుకు 16 వేల ఆర్థిక సహాయం అందించారు.తాజాగా ఆగస్టు నెలలో 9వ విడత పీఎం కిసాన్ నగదును పంపిణి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
అయితే దేశ వ్యాప్తంగా చాలా మంది రైతులకు అన్ని అర్హతలు ఉండి అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ పీఎం కిసాన్ నగదు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే 2020 జనవరి తర్వాత మీరు భూమి పట్టా పాస్ బుక్ పొంది ఉంటే అలాంటి వారి దరఖాస్తులు పెండింగ్ లో చూపిస్తుంది. అంటే భూమి పట్టా పాస్ బుక్ జారీ తేదీ 2020 జనవరి లోపు ఉండాలి. మీకు పి ఎం కిసాన్ డబ్బులు రాక పోవడానికి ఇది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. మరిన్ని వివరాలకు దగ్గరలోని మీసేవ కేంద్రాలు లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.
Share your comments