రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ నెల చివరికల్లా పీఎం కిసాన్ డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఎనిమిదో విడత డబ్బులు రూ.2 వేలను ఈ నెల చివరిలోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఈ డబ్బులను ఈ నెల తొలివారంలోనే ఇవ్వాల్సి ఉండగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేంద్ర పెద్దలు ప్రచారం చేస్తూ బిజీగా ఉండటం వల్ల డబ్బులను జమ చేయలేదు.
ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తారు. ఈ సారి మోదీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల వీలు కాలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులను జమ చేసే అవకాశముంది.
గత ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఏడు విడతల డబ్బులను జమ చేసింది. ఇప్పటివరకు 10 కోట్లకుపైగా రైతులు ఈ పథకంలో చేరారు. ఇంకా అప్లైచేసుకోనివారు ఇప్పడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే తర్వాతి విడత నుంచి డబ్బులు జమ అవుతాయి.
ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా వీటిని చెల్లిస్తుంది. రైతులకు పెట్టబడి సాయం అందించడంలో భాగంగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.
Share your comments