రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.2 వేలు జమ చేయనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను మరికొద్దిరోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేయనుంది. ఆగస్టులో పీఎం కిసాన్ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇప్పటికీ ఈ పథకానికి అప్లై చేసుకోని రైతులు వెంటనే అప్లై చేసుకుంటే.. ఆగస్టులో డబ్బులు పడే అవకాశముంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం(పీఎం కిసాన్) పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న విషయ తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తోంది. ఈ నగదును రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తోంది. అంటే నాలుగు నెలలకు ఒకసారి ఈ నగదు అందిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత డబ్బులు రూ.2 వేలను జమ చేయనుంది. మూడో విడత డబ్బులను డిసెంబర్ లో జమ చేసే ఛాన్స్ ఉంది. గత లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఇప్పటివరకు 8 విడతల డబ్బులను రైతులకు అందించగా.. త్వరలో 9వ విడత డబ్బులను జమ చేయనుంది. ఈ పథకానికి ఇంకా అప్లై చేసుకోని రైతులు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎమ్మార్వో ఆఫీసులో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రత్యేక అధికారి ఉంటారు. ఆ అధికారి దగ్గరికి వెళ్లి అప్లికేషన్ పూర్తి చేసి అప్లై చేసుకోవచ్చు.
ఇక పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ pmkisan.gov.inలోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫార్మర్స్ కార్నర్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అనంతరం మీ కేవైసీ వివరాలు, పట్టదారు పాసుపుస్తకం వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత అప్లికేషన్ స్టేటస్ లోకి వెళ్లి ఎప్పటికప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. ఒకవేళ వివరాలు తప్పుగా నమోదు చేసుకుంటే సవరించుకోవచ్చు. వెబ్ సైట్ కుడివైపు కార్నల్ లో ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ మీద క్లిక్ చేసి సరిచేసుకోవచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 155261, 1800115526, 011-23381092 నెంబర్లకు కాల్ చేయవచ్చు.
Share your comments