కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం గ పీఎం కిసాన్ అనే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే కొన్ని మీడియా కథనాలు ప్రచురిస్తున్న సమాచారం మేరకు అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో 6000 రూపాయలు జమవుతోంది. అయితే కేంద్రం ఈ మొత్తాన్ని పెంచనుందనిప్రస్తుతం 6000 రూపాయలు ఇస్తున్న మొత్తాన్ని 12000 రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు కధనాలు వెలువడుతున్నాయి.
నిజానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టె క్రమంలోనే రైతులకు ఈ శుభవార్త అందిస్తుందని అందరు భావించారు అయితే కేంద్రం బడ్జెట్ లో PM KISAN కోసం ప్రత్యేకంగా ఎటువంటి ప్రత్యేక నిధులను కేటాయించలేదు , అంతే కాకుండా ఇదే విషయమై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పందిస్తూ పీఎం కిసాన్ నిధులను పెంచబోమని స్పష్టం చేసారు కావున రైతులకు పీఎం కిసాన్ నిధులను పెంచుతారని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజంలేదు అని స్పష్టం అవుతుంది .
8 కోట్ల కంటే ఎక్కువమంది రైతులకు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ కలుగుతుండటం గమనార్హం. కొంతమంది రైతులు వివరాలను నమోదు చేయకపోవడం వల్ల లబ్దిదారుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అర్హత లేని వాళ్లను ఈ స్కీమ్ నుంచి కేంద్రం తొలగిస్తుండటం గమనార్హం ఇప్పటికే హర్యానాన్లో దాదాపు 42 కోట్ల వరకు అనర్హులైన వారు పీఎం కిసాన్ నిధులు అందుకున్నట్లు CAG నివేదిక ద్వారా వెల్లడించింది దీనితో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనర్హులను గుర్తించే పనిలో పడింది .
పీఎం కిసాన్ 14 వ విడత ఎప్పుడో తెలుసా ..!
పీఎం కిసాన్ పథకం :
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన అనేది దేశంలోని అన్ని రైతు కుటుంబాలకు పెట్టుబడి మద్దతును అందించే కేంద్ర రంగ పథకం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అవసరంతో పటు రైతుల యొక్క కనీస ఆర్థిక అవసరాలు తీర్చడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, అర్హులైన రైతులు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం పొందుతారు, ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలోచెల్లిస్తుంది .
Share your comments