దేశంలో మొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని మెజెంటా లైన్‌లో డ్రైవర్ రహిత రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు
సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ సేవలను ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో కార్పోరేషన్‌లోని మెజెంటా లైన్‌లో తొలి డ్రైవర్ రహిత రైలు (driverless train) కు ఆయన ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ. నగరీకరణ సవాల్‌గా కాకుండా అవసరంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ సేవలు భారతదేశ అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు.. దీనికోసం ఏకీకృత సాంకేతిక విధానాలను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి సేవల ద్వారా.. ప్రజల జీవితాలు మెరుగుపడుతాయని, నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ డ్రైవర్ రహిత మెట్రో రైలు ఢిల్లీ కార్పోరేషన్ (DMRC)లోని మెజెంటా లైన్‌లో జనక్‌పురి వెస్ట్-బొటానికల్ గార్డెన్ మధ్య మొత్తం 37 కిలోమీటర్ల మేర నడవనుంది. 2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభంకానున్నాయి.. డ్రైవర్ లేకుండా నడిచే రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7 శాతం మాత్రమే ఉన్నాయి.
Share your comments