రైతులను కొంతమంది చులకనగా చూస్తారు. ఏం సాధించలేరని భావిస్తారు. కానీ దేశానికి అన్నం పెట్టడమే కాదు.. రైతులు కూడా ఉన్నతశిఖరాలను అధిరోహిస్తున్నారు. వ్యవసాయం చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. రైతులు అద్భుతాలు సృష్టిస్తూ కొత్త కొత్త వ్యవసాయ పద్దతులను కనుగ్కొంటున్నారు. రైతులే శాస్త్రవేత్తలుగా మారి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక రైతు చేసిన ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్‌కి చెందిన వెంకట్ రెడ్డి అనే రైతు ఎక్కువ మోతాదులో విటమిన్ డి గల వరి, గోధుమ పంటలను తమ పోలంలో పండించి చరిత్ర సృష్టించారు. దీంతో వెంకట్‌రెడ్డి ఫార్ములాకు పేటెంట్ హక్కు లభించింది. అలాగే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా లభించాయి.
ఈ వరి, గోధుమతో పండించిన ఆహారం తినడం ద్వారా విటమిన్ డి పుష్కరంగా లభిస్తుంది. ఎలాంటి ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి విటమిన్ డి గల వరి, గోధుమ పంటను వెంకట్ రెడ్డి పండించారు.
ఈ క్రమంలో వెంకటరెడ్డిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తాజాగా జరిగిన మాన్ కీ బాత్ కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి పేరును ప్రధాని ప్రస్తావించారు. వెంకట్‌రెడ్డిని అందరూ స్పూర్తిగా తీసుకోవాలని, శాస్త్ర విజ్ఞానమంటే కేవలం భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన అంశం కాదన్నారు. సైన్స్ ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన కృషికి గాను గత ఏడాది పద్మశ్రీతో సత్కరించామన్నారు.
వెంకటరెడ్డికి ఆ ఆలోచన ఎలా వచ్చింది?
ఒకసారి వెంకటరెడ్డి ఒక డాక్టర్‌ని కలిశారు. అప్పుడు డాక్టర్ విటమిన్ డి వల్ల వచ్చే వ్యాధుల గురించి వెంకటరెడ్డికి వివరించారు. దీంతో వెంకటరెడ్డికి ఒక ఆలోచన వచ్చింది. మనం రోజూ తిండే ఆహారంతో విటమిన్ డికి ఎలా చెక్ పెట్టవచ్చని ఆలోచించారు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. విటమిన్ డి గత వరి, గోధులమను పండించారు. ఇందుకు గాను క్యారట్, స్వీట్ పొటాటో, మక్కపిండితో చేసిన మిశ్రమాన్ని పంటకు నీళ్లలో పారించి విటమిన్ డీ ఉన్న పంటను ఆవిష్కరించారు.
Share your comments