రైతులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా దేశంలో లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటిని రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే ఏడు విడతల డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకం ఇదే.
మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పెద్ద పథకం కూడా ఇదే అని చెప్పవచ్చు. అయితే 9వ విడత డబ్బులను జమ చేసేందుకు కేంద్రం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 9న 9వ విడత డబ్బులను మోదీ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రూ.19 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 90 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ ఏడాది మే నెలలో 8వ విడత డబ్బులను కేంద్రం జమ చేసింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు 9వ విడత డబ్బులను జమ చేస్తోంది.డిసెంబర్ లో 10వ విడత డబ్బులను జమ చేసే అవకాశముంది.
పీఎం కిసాన్ గురించి
2019, ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఇప్పటివరకు రూ.1.15 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొంతమందికి అర్హత లేకపోయినా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్ల కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో చేయించిన పరిశీలనలో తేలింది. దీంతో ఇటీవల అనర్హులుగా తేలిన 4.2 లక్షల మందిని పథకం నుంచి తొలగించారు. అనర్హులకు ఇప్పటివరకు రూ.2,900 కోట్లు బదిలీ చేసినట్లు ఇటీవల లోక్ సభలో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
అనర్హులైన రైతులకు నోటీసులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. వారి నుంచి డబ్బులు రికవరీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పథకానికి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. స్థానిక రెవెన్యూ కార్యాలయాలు, ఈ స్కీమ్ కి సంబంధించిన స్టేట్ నోడల్ ఆఫీసర్ వద్దకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ పోర్టల్, కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.అర్హులను ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్రలకు కేంద్రం అప్పగించింది.
Share your comments