News

భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే 109 విత్తన రకాలు విడుదల

KJ Staff
KJ Staff

వ్యవసాయ అభివృద్ధిలో విత్తనాభివృద్ధి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలను అభివృద్ధి చెయ్యవలసి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే భారత వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) 109 విత్తన రకాలను అభివృద్ధి చేసింది. వీటిని భారత ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసారు. ఈ కొత్త రకాలు అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా విభిన్న వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలవు. విడుదల చేసిన విత్తనాల్లో వ్యవసాయ మరియు ఉద్యాన విత్తనాలు ఉన్నాయి, ఇవి రైతులకు మేలు చేసేవిధంగా అభివృద్ధి చెయ్యబడ్డాయి.

ఢిల్లీ పూసా క్యాంపస్ లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ ప్లాట్లలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ కొత్త వంగడకను ఆవిష్కరించారు. కొత్త రకాల్లో క్షేత్ర పంట రకాల్లో తృణధాన్యాలు, మినుములు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చెరుకు, పట్టి, మరియు ఇతర ఫైబర్ పంటలున్నాయి ఉద్యాన సాగుకు అనుకూలంగా కూడా కొత్త రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తోటలు, దుంపలు మరియు సుగంధ ద్రవ్యాల పంటలు మరియు ఔషధ మొక్కలను విడుదల చేసారు. ఆవిష్కరణ అనంతరం ప్రధాని అక్కడి రైతులు మరియు శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

ఈ కార్యాక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు, సుస్థిర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా, వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఈ వంగడాలు రూపందించబడ్డాయని అయన తెలిపారు. తమ ప్రభుత్వం దేశంలో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడనికి, మధ్యాహన భోజన పథకం, అంగన్వాడీ సేవలు వంటి ప్రభుత్వ కార్యక్రమాలను అనుసంధానిస్తూ బియోఫోర్టిఫీడ్ పంట రకాలను ప్రోత్సహిస్తున్నాము అని ప్రధాని మోడీ మోడీ ప్రస్తావించారు. ప్రధాని మోడీ విడుదల చేసిన 109 రకాలలో 23 రకాల తృణధాన్యాలు, వరి తొమ్మిది, గోధుమలు రెండు, బార్లీ ఒకటి, మొక్కజొన్న ఒకటి, జొన్న ఒకటి, మినుములు ఒకటి, రాగులు ఒకటి, చీనా ఒకటి, సాంబ ఒకటి, అర్హర్ రెండు ఉన్నాయి. శనగలు మూడు, కందులు, శనగలు ఒకటి, పచ్చిమిర్చి రెండు, నూనెగింజలు ఏడు అలాగే మేత, చెరకు ఒక్కొక్కటి ఏడు, పత్తి ఐదు, జనపనార ఒకటి, 40 రకాల ఉద్యానవనాల విత్తనాల ఉన్నాయి.

భారతియా వ్యవసాయాన్ని అభివృద్ధికి, ఈ ఏడాది రూ. 2,625 కోట్ల రూపాయిల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రైతుల ఫై పడుతున్న భారం తగ్గుతుందని అయన ప్రస్తావించారు. వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేసి, ఆహార భద్రతను పెంపొందించే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 109 రకాల విత్తనాలను విడుదల చేశారని ప్రభుత్వం చెబుతోంది. అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల విత్తన రకాలను అభివృద్ధి చేయడం అనేది నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగించే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 

Share your comments

Subscribe Magazine

More on News

More