News

PM ' SVA 'Nidhi Latest Update: మైక్రోక్రెడిట్ పథకం కింద రూ.3000 కోట్ల రుణాల పంపిణీ.

S Vinay
S Vinay

ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం, వీధి వ్యాపారులు (చిరు వ్యాపారులు) కోసం ప్రధాన మంత్రి SVANIdhi మైక్రోక్రెడిట్ పథకం కింద రూ.3000 కోట్ల రుణాలు జారీ చేయబడ్డాయి. సుమారుగా 30 లక్షల వీధి వ్యాపారులు (చిరు వ్యాపారులు) లబ్ది పొందారు.

జూన్ 2020లో ఈ పథకం మొదలైంది వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండా(collateral free ) రూ. 10,000 వరకు రుణాలు ఇస్తుంది. పథకం యొక్క అధికారక పోర్టల్ నుండి అందుతున్న తాజా డేటా ప్రకారం మార్చి 20,2022 నాటికి 45 లక్షలకు పైగా దరఖాస్తులను వచ్చాయి. ఇందులో 33.38 లక్షల వీధి వ్యాపారులకి రూ.3492 కోట్ల మంజూరు కాగా 30.28 లక్షల మందికి రూ.3137 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. సుమారుగా 1.54 లక్షల శాఖల ద్వారా రుణాలు పంపిణీ చేయబడుతున్నాయి ఇందులో ముఖ్యంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు మరియు స్వయం-సహాయ సమూహం (SHG) బ్యాంకులు వంటివి ఉన్నాయి.

ప్రధానమంత్రి స్వనిధి పథకం పట్టణ ప్రాంతాల్లో మార్చి 24, 2020 లేదా అంతకు ముందు విక్రయిస్తున్న సుమారు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా మొదటి విడతలో రూ.10000 వరకు తిరిగి చెల్లించినట్లయితే రెండవ విడతలో రూ.20000 వరకు మరియు మూడవ విడతలో రూ.50000 వరకు రుణాలను చిరు వ్యాపారాలు అందుకోవచ్చు. పథకం నిబంధనల ప్రకారం, ప్రతి మూడు నెలలకి వడ్డీ రాయితీ మొత్తం రుణగ్రహీత ఖాతాలో జమ చేయబడుతుంది.
రాష్ట్రాల వారీగా చూస్తే, ఉత్తరప్రదేశ్‌లో 7,77,290 దరఖాస్తులు అందగా, మధ్యప్రదేశ్‌లో 5,02,339 దరఖాస్తులు, తెలంగాణ 3,75,824 దరఖాస్తులతో, గుజరాత్‌లో 2,06,308, మహారాష్ట్రలో 2,04,101 దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌లో 2,04,101 దరఖాస్తులు వచ్చాయి.
ఐతే పథకం ఆరంభంలో నిర్ణయించిన 30-లక్షల వీధి వ్యాపారులకి లబ్ది చేకూర్చడానికి ప్రభుత్వానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది.

మరిన్ని చదవండి

160 మంది AP విద్యార్థులకు రూ. 18 లక్షల స్కాలర్షిప్ "చేయూత " చెక్కులు పంపిణి !

Share your comments

Subscribe Magazine

More on News

More