వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి మెరుగైన యాజమాన్య పద్దతులతోపాటు, నూతన సాగు విధానాన్ని జతచేర్చడం చాలా అవసరం. దీనికోసం వ్యవసాయ నిపుణులు మరియు మరియు సాగుదారులు కలిసికట్టుగా పనిచెయ్యడం చాలా అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మొదలుపెట్టినదే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం.
పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని, ఈ నెల 23 నుండి మొదలుపెట్టబోతున్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కమిషనర్ నుండి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో వ్యవసాయ నూతన సాగు విధానాల గురించి అవహగాన కల్పించనున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో రైతులు సమయత్నం అవుతున్నారు.
వ్యవసాయంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చే ఈ కార్యక్రమం, ప్రతీ ఏడాది ఖరీఫ్ మరియు రబి సీజన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది వారానికి రెండు రోజుల చొప్పున, రోజుకు రెండు గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం మరియు బుధవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు పాల్గొంటారు.
పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని సీజన్ మొత్తం చేపట్టేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికత పట్ల రైతులకు అవగాహన కల్పించడంతోపాటు, నూతన సాగు విధానాల్ని, వ్యవసాయ అనుబంధ శాఖల అభివృద్ధికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించనున్నారు. దీనికోసం పరిశోధన కేంద్రాలు, కేవీకేల శాస్త్రజ్ఞులు పాల్గొని మండల స్థాయిలో వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి పంటల స్థితిగతులను పరిశీలిస్తారు. ఆర్బికెల్లో రైతు సమావేశాలు ఏర్పరచి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరానికి తగిన సూచనలు మరియు సలహాలు అందిస్తారు.
Share your comments