తెలంగాణాలో వరిసాగు రికార్డు స్థాయికి చేరింది గతంలో ఎన్నడూ లేనివిదంగా ఇప్పటికి 53 లక్షల ఎకరాకు సాగు చేరుకుంది , వ్యవసాయ అధికారులు 50 లక్షలకు సాగు చేరుకుంటుందని అంచనాలు వేసినప్పటికీ ఆ అంచనాలను తలక్రిందులుచేస్తూ సాగు ఏకంగా 57 లక్షలకు చేరుకుంది ఇప్పటికి దాదాపు యాసంగి సాగు పూర్తి అయ్యింది .ఇప్పటివరకు రాష్ట్రంలో ఇదే రికార్డు స్థాయి సాగు.
కురుస్తున్న వర్షాల కారణంగా , వరి పొట్ట దశలో ఉన్నందున రైతులు క్రింద సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి .
ఈ నెలలో వారి పంట లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరిపంటను ఆశించును.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రానున్న 5 రోజులు AP, తెలంగాణాలో వర్షాలు !
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో అగ్గి తెగులు గమనించడమైనది. తెగులు గమనించినచో నివారణకు 0.6 గ్రా. ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో పాము పొడతెగులు గమనించడమైనది. నివారణకు 2 మి.లీ. హెక్సాకొనజోల్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ లేదా 0.4 గ్రా. కోనజోల్ ట్రైప్టోక్సీస్ట్రోబిన్ 75 డబ్ల్యు జి మందును లీటరు నీటికి కలిపి కాండం
మొదలు తడిచేలా పిచికారి చేయాలి.
Share your comments