సాధారణంగా వేసవి కాలం తర్వాత తొలకరి చినుకులు పడగానే రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషణకు వెళుతుంటారు. భూమిలో ఉన్న వజ్రాలు ఈ విధంగా తొలకరి వర్షాలు పడడంతో బయటకు వస్తాయని ఒక వజ్రం దొరికిన వారి దశ మారిపోతుందని చాలా మంది కుటుంబ సమేతంగా వజ్రాల అన్వేషణకి వెళుతుంటారు. ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు లభించడం మనం చూస్తుంటాము. తాజాగా కర్నూలులోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళకు అదృష్టం ఈ విధంగా వజ్రం రూపంలో దక్కింది.
ఓ మహిళ వ్యవసాయ కూలి పనులు నిమిత్తం ఆదివారం టమాటా నారు నాటు తుండగా ఆ దుక్కలలో మహిళకు వజ్రం లభించింది. ఈ క్రమంలోనే మహిళ తనకు అదృష్టం కలసి వచ్చిందని ఎంతో సంబరపడిపోయింది. అయితే తనకు వజ్రం దొరికిందనే విషయం గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు వజ్రాల వేటలో పడ్డారు. సదరు మహిళకి లభించిన వజ్రాన్ని స్థానికంగా ఉన్న ఓ వ్యాపారి వజ్రాన్ని ఆరు లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
వేసవి తొలి చినుకులు పడిన తర్వాత కర్నూలు జిల్లాలోని జొన్నగిరి,పగిడిరాయి,ఎర్రగుడి,మద్దికెర వంటి ప్రాంతాలలో ఎర్ర నేలలో ఎక్కువగా ఈ వజ్రాల అన్వేషణ జరుగుతుంది.ఈ విధంగా వజ్రాలు దొరకడంతో కోట్లు విలువ చేసే వజ్రాలను స్థానిక వ్యాపారులు అతి తక్కువ ధరకే విక్రయించి మోసం చేస్తున్నట్లు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ రైతుకు ఇక్కడే కోటి రూపాయలు విలువ చేసే వజ్రం లభించింది. మే 17వ తేదీన జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళకు 30 క్యారెట్లు విలువ చేసే బంగారం లభించిందని, ఆ మరుసటి రోజే మరో మహిళకు వజ్రం లభించిందని గ్రామస్తులు తెలిపారు. ఈ విధంగా వరుసగా వజ్రాలు లభించడంతో మిగతా గ్రామ ప్రజలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Share your comments