ఇప్పటివరకు ప్లాటిక్ భూతం భూమిని, పర్యావరణని దెబ్బతీస్తుందని మనం తెలుసుకున్నాం. అయితే తాజాగా మన నిత్యం వినియోగించే ఉప్పు మరియు చెక్కెరలో కూడా ప్రమాదమైన మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు. ఎటువంటి బ్రాండ్ లేని ఉప్పు మరియు చెక్కెరతో పాటు పెద్ద బ్రాండ్లలో ఉప్పు మరియు చెక్కెరలోని ప్లాస్టిక్ అణువులు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద బ్రాండ్ చిన్న బ్రాండ్ అని లేదు వేటికి మినహాయింపు లేదు. ప్యాకేజ్డ్ మరియు అన్-ప్యాకేజ్డ్ లోను మైక్రో ప్లాస్టిక్ ఉందని, టాక్సిక్ లింక్ అనే పర్యావరణ సంస్థ నిర్వహించిన ' మైక్రో ప్లాస్టిక్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్' అనే అధ్యనంలో వెల్లడైంది.
టాక్సిక్ లింక్ సంస్థ, 10 రకాల ఉప్పులు మరియు 5 రకాల చెక్కెరలను తీసుకోని ఆద్యనం జరిపింది, దీని యొక్క వివరాలను మంగళవారం వెల్లడించడం జరిగింది. ఈ ఆద్యానంలో టేబుల్ సాల్ట్, రాక్ మరియు సముద్రపు ముడి ఉప్పులను ఉంచారు. వీటన్నిటిలో ఐయోడైజ్డ్ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని ఈ సంస్థ పేర్కొంది. ఉప్పు మరియు చెక్కెర్లలో వివిధ రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని, ఇవి ఫైబర్, పిల్లెట్స్ మరియు ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ మైక్రో ప్లాస్టిక్ సైజు 0.1-5 మిల్లీమీటర్ల మధ్యలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఉప్పు మరియు చెక్కెర వినియోగం ఎక్కువుగా ఉంటుంది. భారతీయులు ఒక రోజుకు సగటున 10.98 గ్రాముల ఉప్పును మరియు 10 చెంచాల వరకు చెక్కెరను తీసుకుంటారని కొన్ని సర్వేల్లో వెల్లడైంది, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దానికంటే ఈ పరిమాణం చాలా ఎక్కువ. ఈ మైక్రో ప్లాస్టిక్ రేణువులు పర్యావరణానికి మరియు శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయి. మైక్రో ప్లాస్టిక్ రేణువులు మనం తినే, ఆహారం, గాలి మరియు నీటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి, ఊపిరితిత్తులు మరియు గుండె ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యనాల్లో తల్లి పాలు మరియు గర్భస్థ శిశువుల్లోనూ మైక్రో ప్లాస్టిక్ అణువును ఉన్నట్లు రుజువైంది.
టాక్సిక్ లింక్ అధ్యనం ప్రకారం ఒక కిలో ఉప్పులో 6.91 ఉంది 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు తెలిసింది. ఉప్పు రకాన్ని బట్టి ఈ పరిమాణం మారుతూ వస్తుంది. ప్రతి ఇంట్లో సాధారణంగా వినియోగించే ఐయోడిజ్డ్ ఉప్పులో మైక్రో ప్లాస్టిక్ 89.15% ఉండటం గమనార్హం. అయితే ఆర్గానిక్ రాక్ సాల్ట్ లో మాత్రం 6.7 మాత్రమే ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా ఒక కిలో పంచదారలో 11.85 నుండి 68.85 మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు సంస్థ పేర్కొంది. మైక్రో ప్లాస్టిక్ శాస్త్రీయ డేటాబేస్ కు మరింత సమాచారం చేకూర్చడానికి తాము ఆద్యనం చేసినట్లు, టాక్సిక్ లింక్ ఫౌండర్, డైరెక్టర్ రవి అగర్వాల్ తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయంగా మైక్రో ప్లాస్టిక్ పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని తెలిపారు.
Share your comments