News

రూ.198 తగ్గిన 19 కిలోల LPG సిలిండర్ ధర !

Srikanth B
Srikanth B

జులై 1 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.198 తగ్గింది.తాజా తగ్గింపుతో, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర ఇప్పుడు రూ.2021 అవుతుంది.

19 కిలోల సిలిండర్లలో అతిపెద్ద వినియోగదారు విభాగంలో ఉన్న రెస్టారెంట్లు, తినుబండారాలు, టీ స్టాల్స్ మరియు ఇతరులకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది.గత నెల జూన్ 1వ తేదీన ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల ధర రూ.2219.

అంతకుముందు మే మొదటి వారంలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర రూ.50 పెరగగా.. మే 1న 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పిజి సిలిండర్‌ ధర రూ.102.50 పెరిగి రూ.2355.50కి చేరింది.ఏప్రిల్, మార్చి నెలల్లో కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.250, రూ.105 చొప్పున పెంచారు.

 

ఎల్‌పిజి సిలిండర్ రేటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు నెలవారీగా సవరించబడుతుంది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏమిటి, భారతదేశం దానిని ఎందుకు నిషేధిస్తోంది?

Share your comments

Subscribe Magazine

More on News

More