ఏప్రిల్ ఒకటవ తారీకు నుండి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పై 32 రూపాయిల వరకు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా దేశం మొత్తం మీద ఉన్న కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించనుంది. 19 కేజీల గ్యాస్ సిలిండర్ పై ఈ తగ్గింపు దేశంమొత్తం అమల్లోకి రానున్నది. అయితే గ్యాస్ సిలిండర్ పై ధర భారత దేశంలోని వివిధ నగరాల్లో, వివిధ ధరల్లో అందుబాటులోకి వస్తుంది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై ధర తగ్గించిన తర్వాత, దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు ఈ విధంగా ఉండనున్నాయి. ఢిల్లీ 19 కేజీల గ్యాస్ సిలిండర్ 1764.50 రూపాయిలు, కలకత్తా 1879 రూపాయిలు, ముంబై 1717.50 రూపాయిలు మరియు చెన్నైలో 1930 రూపాయలుగా ఉండనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలో తగ్గింపు ద్వారా వ్యాపారస్తులకు ఊరట లభించనుంది. ఇదిలా ఉంటె గడిచిన మూడు నెలల నుండి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై, ధర పెరుగుతూ వస్తుంది. మార్చ్ నెలలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పోయి 25.50 రూపాయిలు గ్యాస్ కామపిణీలు పెంచాయి. ప్రతీ నెలా, గ్యాస్ కామపిణీలకు సిలిండర్ పై ధరను నిర్దేశిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను ఇస్తుంది. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా కేంద్రం గ్యాస్ సిలిండర్ పై ధర తగ్గించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మార్చ్ నెలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోడీ 14 కేజీల ఎల్పిజి సిలిండర్ పై 100 రూపాయిలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అదే తరహాలో ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద కూడా 32 రూపాయిలు తగ్గించడం విశేషం.
-
Read More:
-
అక్క, చెల్లెలకు, శుభవార్త అందించిన మోడీజీ.
Share your comments