మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించ్చుకుని, మోడీజీ భారత దేశ మహిళలందరికీ ఒక తీపి కబురును అందించారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలో ఇకనుండి రూ. 100/- తగ్గించ్చనున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారం 'X' లో ట్వీట్ చేస్తూ, భారత ప్రధాన మంత్రి మోడీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఒక ప్రకటన చేసారు. ఇకనుండి గ్యాస్ సిలిండర్ పై 100రూ తగ్గించ్చనున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని లక్షలాది కుటుంబాలపై పడే ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ముఖ్యంగా నారి శక్తి ఆర్ధిక ప్రయోజనాలు బలపరచడంలో దోహదపడుతుందన్నారు.
ఇప్పటికే ఉజ్జ్వల యోజన పధకం ద్వారా దేశంలోని పేద మహిళలకు, సిలిండర్ పై రూ. 300 సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ సబ్సిడీని వచ్చే ఏప్రిల్ 1 వరకూ పొడిగించ్చనున్నారు. వంట గ్యాస్, అందరికి అందుబాటులో మరియు సరసమైన ధరలో లభించడం పర్యావరణ పరిరక్షణలో భాగం అవుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర 900-1100 రూ ఉండేది. మారిన సిలిండర్ ధరలు ఈ అర్ధరాత్రి నుండి అమల్లోకి రాబోతున్నాయి.
Share your comments