News

మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు..

Gokavarapu siva
Gokavarapu siva

భారతదేశంలో ప్రధానంగా పండించే పంటల్లో మిరప పంట కూడా ఒకటి. దేశంలోనే ఈ మిరప సాగులో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ మిరపలో విటమిన్ సి మరియు బి, కాల్షియమ్, మెగ్నీషియం, ఐరన్ అనేవి అధికంగా ఉంటాయి. ఈ నాణ్యతగల మిర్చిని భారతదేశం నుండి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా శ్రీలంక, చైనా, బాంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. కాబట్టి వీటివల్ల మిర్చి ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి.

మిర్చిలో అనేక రకాలు ఉండగా వాటిలో కొన్ని రకాల ధరలు మాత్రం బాగా పెరిగాయి. మిర్చి రకాలు అయిన తేజ మరియు బాడిగ రకాలకు అంతర్జాతీయంగా ఎక్కువ డిమాండ్ ఉండడం వలన బంగ్లాదేశ్‌, శ్రీలంక, చైనా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నారు. ఈ రకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో వీటి ధర అమాంతంగా పెరిగింది.

ఈ ఫలితం అనేది మార్కెట్లో ఉన్న వేరే రకాలపై పడి వాటి ధరలు కూడా పెరిగే అవకాశముంది. అన్ని రకాల మిర్చిపైన మార్కెట్ లో ఈ వారం క్వింటాకు రూ.1000 వరకు పెరిగాయి.

మార్కెట్ యార్డుకు సీజన్ ప్రారంభంలోనే రోజుకు లక్షకు పైగా టిక్కీలు వస్తున్నాయి. మిర్చి ధరలు బాగా పెరగడంతో రైతులకు పెట్టుబడి పోను లాభాలు బాగా వస్తున్నాయి. కనుక రైతులు మిర్చి అమ్మెందుకు ముందుకువస్తున్నారు. కొంతమంది రైతులు మాత్రం నాణ్యమైన మిర్చి గోదాముల్లో దాచి ఇంకా ధరలు పెరిగాక అమ్ముదామని చూస్తున్నారు.

ఇది కూడా చదవండి..

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రజలకు షాక్

ఈసారి అధికంగా ఆర్మూర్‌ రకం విత్తనం సాగు చేయడంతో అదీ మిర్చి మార్కెట్‌కు ఎక్కువగా వస్తోంది. మార్కెట్ యార్డుకు వస్తున్న మిర్చిలో దాదాపుగా 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఈవిధముగా విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుండడంతో దేశంలో వాడుకునే రకాలు పైన కూడా ప్రభావం పది వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి.

ఇటీవలి ఖమ్మం మార్కెట్ యార్డులో తేజా రకం మిర్చికి ఎక్కువ ధర పలికింది. ఈ తేజా రకం మిర్చికి మార్కెట్లో క్వింటాకు రూ.21,650 పలికింది. దీనితో రైతులు సంతోషించారు. ఒక్కపుడు ఈ తేజా రకం మిర్చికి గరిష్టంగా క్వింటాకు రూ.18 వేలు ధర పలికింది. ప్రస్తుతం ఉన్న ధర రికార్డులను తిరగరాసింది.

తేజా రకం ఎండుమిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా ధర రూ.21,650 పలకడంతో పంటను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రజలకు షాక్

Related Topics

chili crop

Share your comments

Subscribe Magazine

More on News

More