పెట్రోల్ ధరలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజానీకానికి మరొక పిడుగులాంటి వార్త ప్రముఖ మార్కెట్ నిపుణలనుంచి వినిపిస్తుంది . ఇప్పటికే ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న ప్రజలపై మూలిగే నక్క పై తాటి పండు పడట్లు గ సామాన్యుల నెత్తిపై నూనెధర పెరిగి మరింత భారం పెరగనునట్లు మార్కెటింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి .
అందుకు కారణం ప్రపంచంలోనే అతిపెద్ద పామ్ ఆయిల్ ఉత్పత్తి దారుడిగా ఇండోనేసియా కొనసాగుతోంది. ఇండోనేసియా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. దేశీయంగా డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. డిమాండ్‌న అందింపుచ్చుకోవడానికి ఎగుమతులను తగ్గించుకోవాలని ఇండోనేసియా భావించింది.
ఇండోనేసియా నుంచి భారత్ వార్షికంగా 80 మిలియన్ టన్నుల పామ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దీని వాటా ఏకంగా 40 శాతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండోనేసియా నుంచి దిగుమతులు తగ్గితే.. ఆ ప్రభావం సరఫరాపై పడుతుంది. సరఫరా తగ్గితే.. ధరలు పైకి చేరే ఛాన్స్ ఉంటుంది. ఇండోనేసియా నిర్ణయం వల్ల వంట నుండే ధరలు గణినీయం గ పెరిగే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు .
రుణమాఫీకి 6,385 కోట్లు కేటాయింపు .. 90 వేలలోపు రుణాలన్నీ మాఫీ
ఈ పరిణామాలతో పామ్ ఆయిల్ ధరలు 10 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి . దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ , మార్కింగ్ నిపుణుల అంచల ప్రకారం మాత్రం భవిష్యత్తు లో నూనె ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి .
Share your comments