దేశవ్యాత్తంగ క్రమంగ నిత్యవసర వస్తువుల ధరలు క్రమంగ పేరుగుతున్నాయి , ఇ సరసన ఉల్లి కుడా చేరింది. దేశం సంగతి పక్కకు పెడితే ఆంద్రప్రదేశ్ లో ఉల్లి ధరలు క్రమంగ పేరుగుతున్నాయి. రాష్ట్రం లో ఉత్పత్తి తగ్గడం, నాఫెడ్ నుంచి వస్తున్న ఉల్లిపాయలు డిమాండ్ కు తగ్గట్టుగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.
సహజంగానే వీటి ధర ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలోని రైతు బజార్లతో పాటు సూపర్ మార్కెట్లలోనూ, ఇతర షాపుల్లోనూ ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రాష్ట్రంలోని పలు రైతు బజార్లలో ఉల్లిధరలు ప్రస్తుతం 30 రూపాయలు వుండగా సూపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో, ఇతర షాపుల్లో 40 రూపాయల దాకా ఉన్నాయి. ఈ ధరలు నిన్న మొన్నటి వరకూ సగమే ఉన్నాయి. అయితే క్రమంగా పెరుగుతున్న డిమాండ్, ఉత్పత్తి తక్కువగా పెంచుకుంటూ పోతున్నారు వ్యాపరులు.
తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి ఉల్లి ధరల పెరుగుదల ఊహించిన కేంద్రం.. డిసెంబర్ వరకూ ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. దీంతో పాటు నాఫెడ్ ద్వారా ఉల్లి సేకరించి సరఫరా చేస్తోంది. అయినా ఇది డిమాండ్ కు సరిపడా ఉండటం లేదు.
రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లకు ఉల్లి పాయల ఉత్పతి తక్కవగా ఉంది.అదే సమయంలో నాఫెడ్ నుంచి కేంద్రం ఇస్తున్న ఉల్లిపాయలు నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్లో ధరలు పేరుగుతున్నాయి.
Share your comments