ప్రధాని నరేంద్ర మోడీ కి అతని తల్లి హీరాబెన్ పై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు .. గతవారం ఆరోగ్య సమస్యతో ఆరోగ్యం క్షిణించి ఆసుపత్రిలో చేరిన ప్రధాని తల్లి హీరాబెన్ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 3 గంటల సమయం లో మరణించారు .
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం గాంధీనగర్ లోప్రారంభమయ్యాయి...ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం గాంధీనగర్ లో ప్రారంభమయ్యాయి.ప్రధాని మోదీ కాన్వాయ్ ఆయన తల్లి హీరాబెన్ నివాసానికి చేరుకుంది.గాంధీనగర్‌లో మోదీ కుటుంబసభ్యులు హీరాబెన్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.గాంధీనగర్‌లోని సెక్టార్ 30 శ్మశాన వాటికలో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. హీరాబెన్ అంత్యక్రియలకు ప్రధాని మోదీతోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. అంత్యక్రియలు జరిగుతున్న ఘటనాస్థలికి రావద్దని కుటుంబసభ్యులకు స్థలం ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలను ప్రధాని కోరారు.
కిసాన్ డ్రోన్ AG 365 కు DGCA అనుమతి ..
ప్రధాని తల్లి మరణం పై దేశ వ్యాప్తముగా ప్రముఖులు సంతాపం తెలిపారు .. ప్రధాని తల్లి మరణం బాధాకరమని దాన్ని భరించే శక్తిని అతనికి ఇవ్వాలని రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా తెలిపారు .
Share your comments